తెలంగాణాలోని నియంత పాలన అంతం అయ్యే దాకా బీజేపీ నిద్రపోదు అని కమలం పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చేదకా వదలం.. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మేమే ఇస్తామని ఆమె అన్నారు.
భర్త అంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు వాళ్లు భౌతికంగా దూరం అయిన తమతో ఉన్నారనే భావనలో ఉంటారు.. వికారాబాద్ తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ఉన్న ప్రేమను మొక్క పై చూపిస్తుంది.. మొక్కలో తన భర్తను చూసుకుంది.. ఇంట్లో ఏ శుభకార్యం అయిన కూడా ఆ చెట్టును రెడీ చేసి అపూరూపంగా చూసుకుంటుంది.. తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్బంగా చెట్టుకు వేడుక చేసింది. కుటుంబ…
బంగారు తెలంగాణ అని చెప్పి నీ కుటుంబాన్ని బంగారు కుంటుంబం చేసుకున్నావు.. తెలంగాణలో దోపిడి చేసి మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాలు చేస్తున్నాడు అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరికాసేపట్లో డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం స్టార్ట్ కానుంది. ఈ మీటింగ్ లో 40 నుంచి 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణాలో వీధికుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది చిన్నారులు మృతి చెందారు.. ఇప్పుడు మరో దారుణం జరిగింది.. రెండు నెలల చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖం పై, తలపై తీవ్రంగా గాయపరిచింది.. ఈ దారుణ ఘటన తెలంగాణ కామారెడ్డిలో వెలుగు చూసింది.. మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుంటి తండాలో చోటుచేసుకుంది.. తండాకు చెందిన భానోత్ సురేష్ జ్యోతి దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి…
తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ కు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అనే చందంగా మారింది ప్రస్తుత ధరలు చూస్తుంటే.. సామాన్యుడి బ్రతుకే ప్రశ్నార్థంగా మారింది. కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. టమాటా, పచ్చిమిర్చి ధర ఎన్నడూ లేనంత పెరిగాయి.
గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Kishan Reddy: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్పేటలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.