మహబూబ్ నగర్ జిల్లా క్లాక్ టవర్ దగ్గర బీజేపీ నిర్వహించిన సభలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారీ, ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏమార్పు వచ్చినా అది పాలమూరు నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు మహబూబ్ నగర్ నుంచే బీజం పడింది అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించిన ఘనత మాదేనని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Manchu Manoj: మంచు మనోజ్ కొత్త అడుగులు..సతీసమేతంగా చంద్రబాబుతో భేటీ?
బంగారు తెలంగాణ అని చెప్పి నీ కుటుంబాన్ని బంగారు కుంటుంబం చేసుకున్నావు.. తెలంగాణలో దోపిడి చేసి మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాలు చేస్తున్నాడు అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల రూపాయలతో జాతీయ రహదారులను వేయించిన ఘనత నరేంద్ర మోడీదే.. కరోనా టైంలో ప్రతి పేదవాడిని ఆదుకున్న ఘనత బీజేపీదే.. ప్రతి పేదవాడికి 5 కిలోల బియ్యం ఇచ్చిన ఘనత మాదేనని కిషన్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మోసం చేయడానికి పుట్టిన పార్టీ.. తెలంగాణలో మార్పు రావాలి.. కాంగ్రెస్ పార్టీ సోనియాకు కొమ్ము కాసే పార్టీ.. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుటిల రాజకీయాలు చేస్తున్నాయి.. ఈ మూడు పార్టీలీడిఎన్ఏ ఒక్కటేనని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: IPL 2024: బ్రూక్తో పాటు మరి కొందరిని వదిలించుకునేందుకు SRH సిద్ధం..!
తెలంగాణలో ఇప్పటి వరకు పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేదు అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినవి కేవలం నీటి మీద రాతలుగా మిగిలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతూ కుటుంబ పాలనను కొనసాగిస్తున్నాడు.. దళితులకు వెన్ను పొడిచి సీఎం కుర్ఛీలో కూర్చున్న కేసీఆర్ మోసకారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: Etela Rajender: మీ నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి
30 లక్షల నిరుద్యోగులను నిండా ముంచిన వ్యక్తి కేసీఆర్.. పేపర్ లీకేజీలకు ప్రేరేపించి నిరుద్యోగులను నిండా ముంచాడు అని కిషన్ రెడ్డి మండిపడ్డాడు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 9 సంవత్సరాలైనా దానిని నెరవేర్చలేదు.. రాష్ట్రంలో కేజీ టు పీజీ ఎక్కడికి పోయింది.. కేసీఆర్ రైతుల రుణమాఫీ ఎటు పోయింది.. కల్వకుర్తి నియంత పాలనకు కల్వకుంట్ల కుటుంబం అద్దం పడుతోంది అని విమర్శలు గుప్పించారు.
Read Also: Jasprit Bumrah: మంచి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్న బూమ్ బూమ్ బుమ్రా.. వీడియో ఇదిగో
మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఫ్రభుత్వం పేదలకు ఎన్ని ఇల్లు కట్టించారో చెప్పాలి అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం 11ఎకరాలు కేటాయించుకుని ఫ్రభుత్వ భూములను లూటీ చేసారు అంటూ ఆయన మండిపడ్డారు. దీనికీ తోడు కాంగ్రెస్ తో కుమ్మకై కాంగ్రెస్ పార్టీకి 10 ఎకారాల భూమి కేటాయించడం.. ఈ రెండు పార్టీలు ఒకటే అనడానికి ఇదే నిదర్శనం అని ఆయన తెలిపారు. ఇంత చేసిన పాలమూరు ప్రజలకు ఇండ్లు కట్టించకుండా తన స్వార్థం కోసం ఇక్కడి ప్రజలను కేసీఆర్ వాడుకుంటున్నాడు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.