తెలంగాణాలోని నియంత పాలన అంతం అయ్యే దాకా బీజేపీ నిద్రపోదు అని కమలం పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చేదకా వదలం.. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మేమే ఇస్తామని ఆమె అన్నారు. మందిని మోసం చేసే విధానం సీఎం కేసీఆర్ కు వచ్చినంతగా ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నారు. సీఎం కేసీఆర్ సోయి తప్పి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు.. డబుల్ బెడ్ రూమ్, రుణమాఫీ, ఉపాధి ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు.. అందులో ఒక్కటైన కేసీఆర్ నెరవేర్చాడా అని డీకే అరుణ అడిగారు.
Read Also: Viral Video: ముసలోడికి మతి పోయిందా.. ఇలా చేశాడేంటి
ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి కేసీఆర్ వస్తున్నాడు.. ఈ మోసగాడి మాటలను ప్రతీ ఒక్కరికీ తెలిసేలా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలి అని డీకే అరుణ తెలిపారు. మన పేరు మీద అప్పులు తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల జేబులు నింపుకున్నారు.. ధనిక రాష్ట్రంలో మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశాడు.. సీఎం కేసీఆర్ లానే ఆ పార్టీ నేతలు కింది స్థాయి నాయకులు చేస్తున్నారు.. ఇక్కడి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తున్నారు.. ఇక్కడ అభివృద్ధి పేరుతో కమిషన్లు తీసుకుంటున్నారు అని అరుణ ఆరోపించారు.
Read Also: AI : అంధులు కోసం ప్రత్యేక కళ్లజోడు..ఏ వస్తువునైనా చూడొచ్చు..!
జిల్లాలో జరిగిన అభివృధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది.. ఇక్కడ నడి ఊర్లో ఉన్న కలెక్టరేట్ ను కూల్చి.. ఆయన ఇంటికి దగ్గర్లో కట్టించుకున్నారు.. హెరిటేజ్ బిల్డింగ్ ను కూల్చి ఏం చేస్తున్నాడో చెప్పాలి అని డీకే అరుణ ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన అభివృధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.. ఇక్కడా నియంత పాలన జరుగుతుంది అని డీకే అరుణ అన్నారు.