ఇవాళ ( సోమవారం ) జరిగిన కేబినెట్ సమావేశంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం, ప్రతి ఒక్కరు హర్షించదగిన విషయం.. ఈ విలీన నిర్ణయం తీసుకున్నందుకు TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి JAC కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణలో ఒక్కసారి కూడా అసెంబ్లీని 30 రోజులు నడపక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నా లాంటి చిన్న సభ్యుడితో.. సీనియర్ అయిన కేసీఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుంది అని ఆయన అన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏంటి అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నేడు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
యువ రైతులు చేస్తున్న వ్యవసాయానికి మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవసాయమే ప్రపంచానికి దిక్సూచి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుంది అని అన్నారు. పంట సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి.. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి అని ఆయన పేర్కొన్నారు.