మోడీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందింది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయి.. 2014కి- 2023కి రైల్వే శాఖకు బడ్జెట్ కు 17రేట్లు పెరిగింది.. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు నేడు( ఆదివారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించిన కేంంద్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.24.50 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ( ఆదివారం ) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు కేసీఆర్ సర్కార్ కు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక, చివరి రోజైన ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. ఎన్నికలు రానున్నందున కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొనింది.
కేసీఆర్ ఎన్నికల తరవాత పత్తా లేకుండా పోతాడు.. ఆర్టీసీ కార్మికులను మోసం చేసేందుకు, ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు.. ఆర్టీసీ కార్మికుల మరణానికి కారణం అయిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ విమర్శించారు.