TSRTC Bill: గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ యూనియన్ నేతల భేటీ.. అందుకే బిల్లు ఆపారట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC Bill: ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ బిల్లు వ్యవహారం రాష్ట్రంలో కాక రేపింది.. ఓవైపు గవర్నర్‌పై అధికార పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బంద్‌కు పిలుపునిచ్చారు.. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గంటల పాటు డిపోలకే పరిమితం అయ్యాయి బస్సులు.. ఇక, రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు కార్మికులు.. అందులో కొంతమంది నేతలను లోపలికి పిలిచి చర్చలు జరిపారు గవర్నర్ తమిళిసై.. కార్మిక సంఘాల నేతలు, గవర్నర్ మధ్య సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది.. ఆ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన నేతలు మీడియాతో మాట్లాడుతూ.. చర్చల సారాశాంన్ని వివరించారు.
ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారని తెలిపారు ఆర్టీసీ యూనిన్ లీడర్ థామస్ రెడ్డి.. సుదీర్ఘంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించాం.. సమ్మె కాలంలో కూడా నేను మీకు సహకరించాను అని గుర్తుచేశారని తెలిపారు. ఇక, కార్మికుల మేలు కోసమే విలీనం విషయంలో ప్రభుత్వానికి ప్రశ్నలు రాశాను అని చెప్పారు.. ప్రభుత్వం కూడా సమాధానాలు రాసి పంపినట్లు తెలిసింది.. కానీ.. మా ఆఫీస్ కి ఇంకా అందలేదు అని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. ఆర్టీసీ బిల్లును ఆపడం నా ఉద్దేశం కాదు.. ప్రభుత్వానికి కొన్ని డౌట్స్ ఉన్నాయని రాసి క్లారిఫికేషన్ కోసం అడిగాను.. అసెంబ్లీ సెషన్ ముగిసే లోపు కచ్చితంగా ఆమోదించేoదుకు ప్రయత్నిస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. సత్వర పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ తెలిపారన్న ఆయన.. నేరుగా ఆమె ఏమైనా సవరణలు ఉంటే రాసి పంపడానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసమే.. నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను అని గవర్నర్ అన్నారని చెప్పుకొచ్చారు. గవర్నర్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా థామస్ రెడ్డి వెల్లడించారు.
Also Read
మరోవైపు.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లే పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు?, అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరిన విషయం విదితమే.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు