ఆర్టీసీ విలీనం.. గవర్నర్‌కు ప్రభుత్వం వివరణ
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య కొత్త వివాదాన్ని సృష్టించింది.. టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.. అయితే, అసెంబ్లీలో టీఎస్ఆర్టీసీ బిల్లును ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం.. కానీ, టీఎస్ఆర్టీసీ బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని గవర్నర్ పేర్కొన్నారు.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని.. ప్రభుత్వం సరైన వివరణ వస్తే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.. అయితే, గవర్నర్ అడిగిన ప్రశ్నలకు తాజాగా వివరణ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్‌కి వివరణ పంపించారు అధికారులు.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని వివరణలో పేర్కొంది ప్రభుత్వం.. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత విధివిధానాలలో అన్ని అంశాలు ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ, ఆంధ్రప్రదేశ్‌లో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వివరణ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాగా, ప్రభుత్వం పంపించిన బిల్లును గవర్నర్ ఆపడంపై ఉద్యోగ, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల బంద్ పాటించిన విషయం విదితమే కాగా.. ఇక, నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత దాదాపు 10 మంది ఆర్టీసీ యూనియన్ లీడర్లను లోపలికి అనుమతించారు.. గవర్నర్‌కు మెమెరాండం ఇవ్వడంతో పాటు.. ఆమెతో ఆర్టీసీ విలీనం బిల్లుపై చర్చించనున్నారు నేతలు.
పుంగనూరులో గాయపడ్డ పోలీసులకు మంత్రి పెద్దిరెడ్డి పరామర్శ.. బాబుపై తీవ్ర ఆరోపణలు
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, దాడులు, ప్రతిదాడులు, రాళ్ల విసురుకోవడం, విధ్వంసం సృష్టించడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు.. నిన్న చంద్రబాబు నాయుడు ర్యాలీలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిన ఈ రోజు పరామర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మేల్యేలు.. నిన్నటి ఘటన అనంతరం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో చిత్తూరులో మంత్రికి భారీగా స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు.. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశారు.. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధ పడుతున్నారు. పుంగనూరు బైపాస్ నుండి వెళ్తాం అని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారు.. ఆ తర్వత కావాలనే పుంగనూరులోకి వెళ్లాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ఆ తర్వత వారు పోలీసులపై విచక్షణంగా దాడి చేశారు.. చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారని ఆరోపించారు. అనరాని మాటలు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టారు.. పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవల కాలంలో లేవన్నారు. కుప్పంలో ఓడిపోతాను అన్న భయంతో చంద్రబాబు ఈ నీచానికి దిగారు ఫైర్ అయ్యారు. కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. పోలీసులకు, ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకం అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా..?
నంద్యాల శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతూ ముగ్గురు నవ జాత శిశువులు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.. రెండురోజుల క్రితం భనగాన పల్లె నుండి గోపి మరియు శ్రావణి అనే దంపతులు కవలలతో ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చారు, చికిత్స పొందుతూ కవలల్లో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విజయభాను అనే మరో తల్లి ప్రైవేట్ హాస్పిటల్ నుండి తన శిశువుని తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ కి రాగ ఈ శిశువు కూడా చికిత్స పొందుతూ చనిపోయింది. శిశువు శరీరంలోకి పాలు వెళ్లి మరో శిశువు మృతి చెందినట్టు చెబుతున్నారు.. అయితే, ఆక్సిజన్ సకాలంలో అందకే తన బిడ్డ చనిపోయిందని తల్లి లక్ష్మి దేవి విలపించగా, హాస్పిటల్ సిబంది నిర్లక్ష్యమే ఈ మృతులకు కారణం అంటూ వారి కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే.. తమ పిల్లలు ప్రాణాలు విడిచేవారు కాదని చెబుతున్నారు.
ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తితో ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్త హత్య
తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని వివాహం చేసుకున్నాడు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. నారాయణపురంలోని టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్న చంద్రశేఖర్.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంగుటూరు మండలం నారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. అయితే, తన భర్తను హత్య చేశారని భువనేశ్వరి పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసింది.. విచారణ చేపట్టిన నిడమర్రు సీఐ మోగంటి వెంకట సుభాష్, చేబ్రోలు ఎస్ఐ స్వామి.. మృతుడి మెడమీద పొదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచినట్లు, తీవ్ర గాయాలను గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. మృతుడు చంద్రశేఖర్ భార్య భువనేశ్వరికి తాడేపల్లిగూడెంకు చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు పోలీసులు.. ప్రియుడితో కలిసి తన భర్తను భువనేశ్వరే హతమార్చినట్టు తేల్చారు. అయితే, భువనేశ్వరికి ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడట.. అదికాస్తా శృతిమించి వివాహేతర సంబంధానికి దారితీయగా.. తమ సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భువనేశ్వరి.. తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది.. ఇక, ఈ కేసుల్లో మరిన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఇది పక్కా చంద్రబాబు ప్లాన్.. ఆయన రాజకీయ నాయకుడే కాదు.. దేశంలోనే పెద్ద రౌడీ..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. పుంగనూరులో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలకు తెరలేపాడు. ఎన్నికలు వస్తున్నాయని తెలిసి ఏదో ఒక విధ్వంసం సృష్టించాలని ఆలోచిస్తాడు అని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాహనాల్లో రాళ్లు, రాడ్లు, కర్రలు, బీర్ బాటిళ్లు, గన్స్ ఉన్నాయి.. ఇది పక్కా చంద్రబాబు నాయుడు ప్లాన్.. ఆయనే గొడవలు చేయించి దానిని వైసీపీ నాయకులు.. కార్యకర్తలకు రంగు పులిమి లబ్ధి పొందాలని చూశాడని ఫైర్ అయ్యారు. పరిటాల రవిని చంపినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్నాను అని గుర్తుచేసుకున్న నల్లపరెడ్డి.. ఆ సమయంలో నాకు.. కరణం బలరామకృష్ణమూర్తికి స్వయంగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఆర్టీసీ బస్సులు తగలబెట్టించండి.. విధ్వంసం చేయండి… బజార్ సెంటర్ వెళ్లి షాపులన్నీ ధ్వంసం చేయమని చెప్పారన్నారు. ఇన్ని కుట్రలు.. కుతంత్రాలు కలిగిన వ్యక్తి చంద్రబాబని ఆరోపించిన ఆయన.. అసలు అతను రాజకీయ నాయకుడే కాదు.. భారతదేశంలోనే ఒక పెద్ద రౌడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో పోలీసుల మీద దాడి చేశారు.. చాలామంది పోలీసులకు గాయాలయ్యాయి.. వాహనాలు తగలబెట్టారు. దీని వెనుక చంద్రబాబునాయుడు హస్తం ఉందన్నారు. కచ్చితంగా ఇటువంటివన్నీ ప్రోత్సహించేది చంద్రబాబే.. దానికి నేను, బలరామకృష్ణమూర్తిలే సాక్ష్యంగా చెప్పుకొచ్చారు.
ఆలయంలో చోరీకి యత్నం.. అసలు వేటి కోసం వచ్చారో తెలుసా..?
నలుగురు వ్యక్తులు తెనాలిలోని వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చారు.. కానీ, భక్తితో చేతులెత్తి మొక్కడానికి కాదు, వాళ్ళ చేతివాటం చూపించడానికి వచ్చారు. దేవస్థానం లో కేశఖండనశాలలోని హుండీ లాకర్ లో భద్రపరిచిన తల నీలాలను దొంగిలిస్తుండగా గమనించిన ఆలయ సిబ్బంది 100కి కాల్ చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దొంగలని పట్టుకునేందుకు ప్రయత్నించారు.. అయితే, దొంగలను పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ రమేష్‌ను 12 అడుగుల ఎత్తు నుండి ఒక దొంగ కిందకి తోసేశారు. దీనితో కానిస్టేబుల్ రమేష్(29 ) కి తీవ్ర గాయాలు అయ్యాయి. రమేష్ పరిస్థితి విషమంగ ఉండడంతో గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. వన్ టౌన్ పోలీసులు తలనీలాలను దొంగలించిన నలుగురు దొంగలలో ఇద్దరిని అదుపులోనికి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారని త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం అని తెలిపారు. కాగా, ఆలయాల్లో చోరీలు, హుండీలు ఎత్తుకెళ్లిన ఘటనలు అక్కడక్కడ వెలుగుచూస్తూనే ఉన్నాయి.
చంద్రయాన్-3లో కీలక పరిణామం.. రాత్రి 7 గంటలకు..
భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోనికి ప్రవేశించనుంది. చంద్రయాన్-3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం పయనించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఇది చంద్రుని కక్ష్యలో ప్రవేశించనుందని ఇస్రో ప్రకటించింది. స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్‌కు అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగతుందని ఇస్రో అంచనా వేస్తోంది. చంద్రుడిపై దిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు సైంటిస్టులు. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ప్రధానమైన తేడా ఉందన్నారు. గతంలో ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా, విక్రమ్ ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసినట్లు చెప్పారు సైంటిస్టులు. చంద్రయాన్-3ని జులై 14న LVM 3-M4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆతర్వాత రోజే దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు సైంటిస్టులు. భూకక్ష్య పూర్తయినతర్వాత ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రుడి దిశగా వెళ్తుంది. ఇవాళ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. చంద్రయాన్-3 ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపై దిగితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా రికార్డుకెక్కుతుంది భారత్. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇస్రో 613 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక చంద్రయాన్-3 బరువు 3వేల 900 కిలోలు కాగా.. అందులో ల్యాండర్, రోవర్ బరువు 1752 కిలోలు. చంద్రునిపై వాతావరణం, ఖనిజ సంపద, అక్కడి పరిస్థితులను ల్యాండర్ క్షుణ్ణంగా పరిశీలించి సమాచారం ఇస్తుంది.
శుభవార్త.. గడువు ముగిసినా ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చు
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ రిటర్న్ చేసేందుకు ఈ సారి ఎలాంటి పొడగింపు ఇవ్వలేదు. జూలై 31 వరకు ప్రజలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి తమ ఆదాయాలను వెల్లడించాలి. ఈసారి జూలై 31 వరకు 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. చాలా మంది వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను గడువు తేదీ 31 జూలై 2023 నాటికి కూడా ఫైల్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ ప్రజలకు ఓ శుభవార్త వచ్చింది. మీరు పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులైతే.. గడువు తేదీలోగా రిటర్న్‌ను ఫైల్ చేయలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 31 డిసెంబర్ 2023 వరకు పన్ను చెల్లించే అవకాశం ఉంది. దీన్ని ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆలస్యంగా దాఖలు చేయడం అంటారు. ఆలస్యంగా వచ్చిన రిటర్న్‌లను 31 జూలై తర్వాత కానీ డిసెంబర్ 31లోపు ఎప్పుడైనా ఫైల్ చేయవచ్చు. అయితే దీని కోసం ప్రజలు ఆలస్య రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యమైన ఆదాయపు పన్ను రిటర్న్‌కు పెనాల్టీ అనేది మీ సంపాదన ఆధారంగా ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి ఆలస్య రుసుముగా రూ. 5000 చెల్లించి పన్నును దాఖలు చేయవచ్చు. మరోవైపు రూ.5 లక్షల లోపు జీతం ఉన్నవారు రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఓటీటీలోకి JD చక్రవర్తి అరంగేట్రం.. హాట్ స్టార్‌లో తెలుగు వెబ్ సిరీస్ దయ.
జేడీ చక్రవర్తి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు, కథానాయకునిగా, ప్రతినాయకునిగా, సహాయనటునిగా, దర్శకునిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. వెండితెరమీద ఒక వెలుగు వెలిగిన ఈయన ప్రస్తుతం ఓటీటీ వేదికైన హాట్ స్టార్ లో దయ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఉత్కంఠ ఉద్రేకాలతో సాగె ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహించగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.. శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మాణం వహించారు. ఒక సాధారణ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గర్భవతిగా ఉన్న తన భార్యకి కష్టం కలగకుండా చూసుకోవాలని కష్టపడుతున్న అతనికి తను నడుపుతున్న వ్యాన్‌లో అతనికే తెలియకుండా ఒక శవం ఉంటే, అది ఒక ప్రముఖ జర్నలిస్ట్ ది అయి ఉంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ అనుకోని సంఘటన అతని జీవితాన్ని ఎలా మార్చింది? అసలు హత్య చేసింది ఎవరు? ఈ సమస్య నుండి డ్రైవర్ ఎలా బయటపడ్డాడు? అనే ప్రశ్నలతో క్షణక్షణం ఉత్కంఠ భరితంగ సాగే ఈ చిత్రం ఆగష్టు 04 వ తేదీన విడుదలైంది.
బుర్రిపాలెంలో ‘సూపర్ స్టార్’ కృష్ణ విగ్రహావిష్కరణ.. భారీగా తరలివచ్చిన ఫాన్స్!
బుర్రిపాలెం బుల్లోడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ నేడు ఘనంగా జరిగింది. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ కుటుంబ సభ్యులు.. సూపర్ స్టార్ సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. విజయవాడ నుంచి బుర్రిపాలెం వరకూ ఫాన్స్ ర్యాలీ నిర్వహించనున్నారు. కృష్ణ గత ఏడాది నవంబర్ 15న కన్నుమూసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్, హీరో సుదీర్ బాబు దంపతులు, కృష్ణ కూతుళ్లు మంజుల మరియు పద్మావతి, దర్శకుడు కృషారెడ్డి, మాజీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంకు టాలీవుడ్ సూపర్ స్టార్, కృష్ణ కుమారుఫు మహేష్ బాబు హాజరుకానట్టు తెలుస్తోంది.
థైస్ షోతో సెగలు రేపుతున్న చిరుత బ్యూటీ..కుర్రాళ్లకు పండగే..
రామ్ చరణ్ తెలుగులో హీరోగా చేసిన మొదటి సినిమా చిరుత సినిమా హీరోయిన్ నేహాశర్మ పేరు అందరికి గుర్తే ఉంటుంది.. ఆ సినిమా అనుకున్నంత హిట్ టాక్ ను అందుకోలేక పోయిన అమ్మడు గ్లామర్ కు కుర్రాళ్లు పడిపోయారు.. ఆమెను తెగ ఫాలో అయ్యారు.. ఆ తర్వాత ఈ అమ్మడు ఒకటో రెండో సినిమాల్లో కనిపించింది.. ఆ సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.. దాంతో అమ్మడు బాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..అక్కడ సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఎంతగా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా థైస్ షోతో సెగలు రేపుతున్న ఫోటోలను షేర్ చేసింది.. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. సినిమాలో అవకాశాల కోసం అందాలను ఆరబోతతో మేకర్స్ కి ఎరవేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మరో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. రెడ్ ట్రెండీ వేర్ ధరించింది. థైస్ షో చేస్తూ మత్తెక్కిస్తుంది. నిషా ఎక్కించే కళ్లతో టెంప్ట్ చేస్తుంది. దీనికితోడు తన అందాలను దాయలేని డ్రెస్ ధరించి మరింతగా రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ఓ రకంగా కుర్రాళ్లకి అదిరిపోయే అందాల పండుగ తీసుకొచ్చింది నేహా శర్మ.. ఈ అమ్మడు అందాలకు వేడి పుడుతుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని అలరిస్తున్నాయి. ఈ అమ్మడిపై వాళ్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. భూమిపై నీ కంటే హాట్‌గా మరేదిలేదంటున్నారు. చాలా అందంగా ఉన్నావని, తమ క్రష్ నువ్వే అంటున్నారు నెటిజన్లు. అందాల ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు.. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిన అమ్మడు బాలీవుడ్ వెళ్లి అక్కడ బాగానే సినిమాలు చేసింది. ఓ రేంజ్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ ఇప్పుడు ఆశించిన ఆఫర్లు రావడం లేదు. దీంతో రెగ్యూలర్‌గా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. యాడ్స్ చేస్తూ నెట్టుకొస్తుంది..తన చెల్లితో కలిసి రెగ్యూలర్‌గా జిమ్ సెంటర్ వద్ద కనిపిస్తుంది. అందాల విందు చేస్తూ అదరగొడుతుంది. గ్లామర్ షోలో అక్కా చెల్లెళ్లు పోటీ పడుతుండటం విశేషం.. ప్రస్తుతం బాలివుడ్ లో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం..
చంద్రముఖిగా కంగనా రనౌత్.. ఫస్ట్ లుక్ అదుర్స్!
కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పీ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త. వినాయక చవితి పండగ సీజన్‌లో చంద్రముఖి 2 సినిమా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల చంద్రముఖి 2 మూవీ నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. నేడు బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో కంగనా పట్టు శారీ కట్టుకుని, నగలు పెట్టుకుని అందంగా ఉన్నారు. ఓ గదిలో దేన్నో తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు. పోస్టర్‌లో కంగనా భయపెట్టే మాదిరి అయితే లేదు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రముఖి 2లో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల కానుంది. 18 ఏళ్ల ముందు సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు, వడివేలు ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు ఇది సీక్వెల్.
సరికొత్త రికార్డ్ ను బ్రేక్ చేసిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’..
త్రిపుల్ ఆర్ ఘన విజయం అందుకోవడంతో పాటు ఆస్కార్ ను కూడా గెలుచుకుంది.. ఆ సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన రేంజ్ పెరిగిపోయింది.. ఇక ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారా అని మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.. ఈ క్రమంలో రోబో ఫెమ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.. ఈ సినిమా #RRR మూవీ విడుదల సమయం లో ప్రారంభం అయ్యింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో పూర్తి అవ్వాలి. కానీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే శంకర్ కమల్ హాసన్ తో చేస్తున్న ‘ఇండియన్ 2 ‘ చిత్రాన్ని కూడా తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది.. దాంతో రామ్ చరణ్ సినిమాకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది..నెల రోజుల్లో 15 రోజులు ఇండియన్ 2 కి పని చేస్తే మరో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రానికి పని చెయ్యాల్సి వచ్చింది. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ లో కూడా సినిమా విడుదలయ్యేలా కనిపించలేదు..