బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీలో నేను వస్తానోరానో తెలియదు అని వ్యాఖ్యనించాడు. వచ్చే సభలో నేనైతే ఉండకపోవచ్చు అనుకుంటున్నా.. నేను ఉన్నా, లేకున్నా తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని రాజాసింగ్ తెలిపారు. ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. సొంతవారితో పాటు, బయటివారు కూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గాన్ని విస్మరించడం బాధాకరంగా ఉందని రాజాసింగ్ తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనులపై పలుసార్లు చెప్పిన స్పందించలేదుని రాజాసింగ్ వెల్లడించారు.
Read Also: Dhoni: ధోని కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!
ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ కు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం విముఖతతో ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవల రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటీ కావటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం సైతం జరుగుతుంది. అయితే, ఆ భేటీపై రాజాసింగ్ వివరణ ఇచ్చుకున్నారు. కేవలం తన నియోజకవర్గంలో సమస్యలను వివరించేందుకు మాత్రమే మంత్రిని కలిసినట్లు పేర్కొన్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడనని రాజాసింగ్ చెప్పారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పార్టీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Kishan Reddy: మోడీ నాయకత్వంలో అభివృద్ధి బాటలో ఇండియన్ రైల్వే