హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతుంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో పాటు శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి.
జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బొప్పా మోరియా.. గణేషుడి పండగ వచ్చిందంటే గల్లీ గల్లీకి వినపడే స్లోగన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేషుడు అంటే స్పెషల్. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు.
ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు బీజేపీ నేత గోదావరి అంజిరెడ్డి. ఇటీవల చనిపోయిన నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి అంజిరెడ్డి రూ.20 లక్షలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం నుంచి తమిళనాడు, హైదరాబాద్ లో 22 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపింది. ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల కోసం విస్తృత తనఖీలు చేసింది.. రెండు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో దాడులు చేయగా.. ఎన్ఐఏ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.