LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
- వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు
- రాయగడ్ జిల్లాలోని పాతాళగంగా నదిలో
- ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG cylinders washed away: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాయగడ్ జిల్లాలోని పాతాళగంగా నదిలో సుమారు 3,000 ఎల్పీజీ (LPG) సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, నదిలో లేదా నది ఒడ్డున కనిపించే సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. రాయగడ్ జిల్లాలోని పన్వేల్ తాలూకాలో ఉన్న HPCL పాతాళగంగా LPG బాట్లింగ్ ప్లాంట్ భారీ వరదలతో నీట మునిగిపోయింది. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ప్లాంట్‌లో నిల్వ ఉంచిన నింపిన, ఖాళీ సిలిండర్లు కలిపి సుమారు 3,000 ఎల్పీజీ సిలిండర్లు పాతాళగంగా నదిలో కొట్టుకుపోయాయి.
సిలిండర్లను ముట్టుకోవద్దు: కలెక్టర్ హెచ్చరిక
రాయగడ్ జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేశారు. “నదిలో కొట్టుకుపోయిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో, అవి సురక్షిత స్థితిలో ఉన్నాయో లేదో చెప్పడం సాధ్యం కాదు. ఆసక్తితో వాటిని ఎత్తుకోవడం, ఇంటికి తీసుకెళ్లడం లేదా తెరవడానికి ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరం. అలాంటి చర్యలు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు” అని ఆయన హెచ్చరించారు.
Also Read
- PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
- Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
సిలిండర్ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి
నదిలో లేదా నది పరిసర ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే స్థానిక అధికారులు, పోలీసు శాఖ లేదా విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
సిలిండర్ల కోసం గాలింపు
వరదలో కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాయగడ్ జిల్లాలో అప్రమత్త పరిస్థితులు కొనసాగుతుండగా, ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం మరోసారి కోరింది.
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!