Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Double Murder: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. తిరుచానూరు రోడ్డులోని టీటీడీకి చెందిన పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ అనే మహిళ కుమార్తెను ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్ కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. అయితే, కొద్ది నెలల కిందట ఎలాంటి కారణం చెప్పకుండా సునీల్ తన భార్యను వదిలేశాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు సునీల్ వస్తున్నట్లు సంపూర్ణమ్మకు సమాచారం అందింది. వెంటనే ఆమె తన కుమార్తె పెళ్లికి పెద్దలుగా ఉండి దగ్గరుండి వివాహం జరిపించిన మునిరత్నం, మణికంఠలకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో వారు కల్యాణ మండపానికి చేరుకుని సునీల్‌ను అడ్డుకున్నారు. సంపూర్ణమ్మ కుమార్తెను కారణం లేకుండా ఎందుకు వదిలేశావంటూ పెళ్లి మండపంలోనే సునీల్‌ను గట్టిగా నిలదీశారు.
ఈ సమయంలో అక్కడ ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ జరుగుతుండగానే సునీల్ తమ్ముడు, అతని అక్క, మరో బంధువు కలిసి అక్కడికి చేరుకున్నారు. సునీల్‌తో కలిసి ఆ నలుగురు ఒక్కసారిగా మునిరత్నం, మణికంఠలపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం రక్తపు మడుగులో మునిగి ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న మణికంఠను స్థానికులు వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికంఠ కూడా కన్నుమూశాడు. ఒక్కసారిగా జరిగిన ఈ జంట హత్యలతో కల్యాణ మండపంలోని వారంతా భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
అయితే, తిరుపతిలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్, అతని తమ్ముడు, అక్కతో పాటు మరో వ్యక్తి ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని సంవత్సరాల క్రితం తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను సునీల్ వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది నెలల క్రితం ఎలాంటి కారణం చెప్పకుండా భార్యను వదిలివేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి సునీల్ హాజరవుతున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ, తన కుమార్తె వివాహానికి పెద్దలుగా వ్యవహరించిన మునిరత్నం, మణికంఠలకు సమాచారం ఇచ్చారు.
పెళ్లి మండపంలో సునీల్‌ను కలిసిన మునిరత్నం, మణికంఠలు అతడిని భార్యను వదిలివేయడంపై ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న సునీల్ సోదరుడు, అక్క, మరో బంధువుతో కలిసి వారిపై కత్తులతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటనలో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పరారీలో ఉన్న సునీల్ కోసం పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
-
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
-
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!