ఈడీ బోడిలకు భయపడేది లేదు అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఏం జరిగినా దేశం అగ్నిగుండమేనంటూ ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ని రాజకీయంగా తట్టుకోలేకే ఈ డ్రామాలు.. మహిళా బిల్లు కోసం దేశం అంత మద్దతు కోసం కవిత లేఖలు రాస్తే చూడలేకే.. ఈడీ ఈ నోటీసులు ఇచ్చింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఒక గంట నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది.. ఇక, నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అంటూ ఆయన ఆరోపించారు.
తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదాండరాం మాట్లాడుతూ.. అందరం కలిసి ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. కానీ కేసీఆర్ మాత్రం నా ఒక్కోడి వాల్లే వచ్చిందని చెప్పుకుంటున్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు
కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాలమూరుపై విమర్శలు చేస్తున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ హయంలో పాలమూరు ప్రాజెక్ట్ అంటేనే పెండింగ్ ప్రాజెక్ట్ లుగా పేరు పడింది.. పెండింగ్ ప్రాజెక్ట్ లన్నింటిని మన సీఎం కేసీఆర్ పూర్తి చేస్తున్నారు.. ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్ట్ అంటూ ఆయన తెలిపారు. ప్రతి పక్షాలు శకుని మాటలు మాట్లాడుతున్నాయన్నారు.