Lenin Target : లెనిన్ హిట్ స్టేటస్ కోసం ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ శుక్రవారం థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస ప్లాప్స్ కొడుతున్న అఖిల్ కు ఈ సినిమా హిట్ అవడం చాలా కీలకం. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ లేదా ‘సూపర్ హిట్’ హోదాను అందుకోవాలంటే ఎంత కలెక్ట్ చేయాలనే దానిపై ఆసక్తికరమైన లెక్కలు వినిపిస్తున్నాయి.
ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ఈ సినిమా అన్ని ఖర్చులు కలుపుకొని బాక్సాఫీస్ వద్ద ‘సూపర్ హిట్’ స్టేటస్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. షేర్ పరంగా చూసుకుంటే.. డిస్ట్రిబ్యూటర్లకు సేఫ్ జోన్‌తో పాటు లాభాలు రావడానికి రూ. 25 కోట్ల మేర వరల్డ్‌వైడ్ షేర్ సాధించాల్సి ఉంది.ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మాస్ లుక్‌లో కనిపిస్తుండటం ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంతో సినిమాపై మంచి క్రేజ్ ఉంది. ఒకవేళ మొదటి రోజు నుంచే థియేటర్లలో ‘పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్’ వస్తే రూ. 50 కోట్ల గ్రాస్ టార్గెట్‌ను అందుకోవడం ‘లెనిన్’ చిత్రానికి పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఖిల్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు ఈ చిత్రం సరైన బ్రేక్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా అసలు స్టామినా ఏంటో తెలియబోతుంది.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!