తాను మరణించి ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా కృష్ణ.. ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ఈనెల 23న చిలకలూరిపేట సమీపంలో ట్రావెల్ బస్సు వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ పేషెంట్ గా మారాడు కృష్ణ. అతను తిరిగి కోలుకోవదం కష్టమని డాక్టర్లు చెప్పారు. అతని అవయవాలను దానం చేస్తే మరో ఆరుగురి జీవితంలో వెలుగు వస్తుందని సూచించడంతో.. కృష్ణ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు అతని కుటుంబ సభ్యులు. దీంతో గుంటూరు రమేష్ హాస్పటల్ నుంచి ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.. గ్రీన్ ఛానల్ ద్వారా కిడ్నీలు, కాలేయం తరలించగా, గుండెను ప్రత్యేక హెలికాఫ్టర్ లో తిరుపతి పద్మావతి హాస్పిటల్ కు తరలించారు వైద్యులు. టీటీడీ పద్మావతి ఆస్పత్రిలో 33 ఏళ్ల వ్యక్తికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు.
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎల్పీపై బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై కేసు నమోదు చేశారని చంద్రబాబు తెలిపారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఆయన తరపు లాయర్లు రు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్.. న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. కేసు సంఖ్య నంబర్ 61గా పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి చంద్రబాబు మూడు విన్నపాలు చేశారు. వాటిలో ఒకటి… తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ను కొట్టేయాలని, రెండోది జ్యుడీషియల్ రిమాండ్‌ను సస్పెండ్ చేయాలని, మూడోది.. తనపై విచారణను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుండటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. చంద్రబాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాదనలు జరగనున్నాయి.
మళ్లీ చిరుత కలకలం.. ఈవో ఇంటి దగ్గర సంచారం.. నడకదారిలో టెన్షన్
తిరుమల నడక దారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.. ఇప్పటికే తిరుమలలో ఆరు చిరుతలు బోనుకు చిక్కాయి.. ఓ బాలుడు, చిన్నారి లక్షితపై దాడి తర్వాత అప్రమత్తమైన టీటీడీ.. ఫారెస్ట్ అధికారులతో కలిసి ‘ఆపరేషన్ చిరుత’ చేపట్టారు.. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.. చిరుత సంచారాన్ని గుర్తించి బోన్‌లు ఏర్పాటు చేయడంతో.. ఇప్పటికే ఆరు చిరుతలను బంధించారు.. ఇక, దాదాపు వారం రోజుల పాటు ట్రాప్ కెమెరాలకు చిరుతల సంచారం చిక్కకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. నడకదారిలో భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. చిరుతలు ఇక లేవు అనే నిర్ణయానికి కూడా వచ్చారు టీటీడీ అధికారులు.. కానీ, మళ్లీ ట్రాప్ కెమెరాకు చిరుత సంచారం చిక్కడంతో ఆందోళన మొదలైంది.. రాత్రి.. టీటీడీ ఈవో ఇంటి సమీపంలో చిరుత సంచారాని ట్రాప్ కెమరాలు ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇక, ఆ చిరుతను కూడా బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం తిరుమలలో పర్యటించనుంది.. తిరుమల నడకదారిలో ఇనుప కంచే ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించనుంది వైల్డ్ లైఫ్ కమిటీ.. నడక దారిలో ఇనుప కంచే ఏర్పాటుపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. కంచే ఏర్పాటుపై అనుమతులు మంజూరు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. నిన్న 55,747 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 21,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.11 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగినున్నాయి.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన సమావేశాల్లో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ వచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇక, ఆ తర్వాత శాసన సభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది టీడీపీ.. అయితే, ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. ఈ రోజు సభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు -2023, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లు (నెం.3) -2023లు ఈరోజు సభ ముందుకు రానున్నాయి.. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది వైఎస్ జగన్ సర్కార్. మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులో అక్రమాలపై షార్ట్ డిస్కషన్ జరగనుంది.. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నారు. మరోవైపు.. ఏపీ శాసన మండలి సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగియనున్నాయి.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న శాసన మండలి సమావేశాలను ప్రశ్నోత్తరాలతో ప్రారంభించనున్నారు మండలి చైర్మన్.. ఇక, మండలి ముందుకు ఈ రోజు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు రానుంది. స్కిల్ స్కాం పై రెండవ రోజు చర్చ కొనసాగనుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధిపై స్వల్ప కాలిక చర్చలు సాగనున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.
శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు.. రేపు మధ్యాహ్నం 12గంటలకు నిమజ్జనం
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహా’ నిమజ్జనం మొదలైంది. నవరాత్రి పూజల నిమిత్తం ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణపతి” నిమజ్జన శోభాయాత్ర గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనం పూర్తవుతుంది. ఈ మేరకు పోలీసు శాఖ సూచన మేరకు మినిట్ టు మినిట్ విడుదల చేసింది. గణేష్ శోభాయాత్రకు నగరం ముస్తాబైంది. వీధివీధినా యాత్రికులు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. ఖైరతాబాద్‌లో దశ మహా విద్యాగణపతి కూడా వీడ్కోలు పలికారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మహా నిమజ్జన ఘట్టం పనులు ప్రారంభమయ్యాయి. శోభాయాత్ర కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఉప మండపంలో విగ్రహాలను సిద్ధం చేసి బడ గణేశుడికి అంతిమ పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి.
వివాహ వేడుకలో భారీ అగ్ని ప్రమాదం.. 100 మందికి పైగా మృతి! 150 మందికి పైగా గాయాలు
ఇరాక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. మరోవైపు 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక అధికారులు, మీడియా వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చాలా గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయట. నినెవే ప్రావిన్స్ హమ్దానియా జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరగడంతో వివాహానికి హాజరైన వారిలో 100 మందికి పైగా మృతి చెందారు. మరో 150 మందికిపైగా అతిథులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మంటలు చెలరేగడంతో అతిథులు బయటకు పరుగులు తీశారట. ఆ సమయంలో కిందపడిన వారు మంటలో చిక్కుపోయారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో నూతన వధూవరులు కూడా ఉన్నట్లు సమాచారం. బాగ్దాద్‌కు వాయువ్యంగా 400కిమీ (సుమారు 250 మైళ్లు) దూరంలో హమ్దానియా ఉంటుంది.
కాఫీని ఇలా తాగండి.. బరువు తగ్గిపోతారు
ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. ఇలా చేస్తే బరువు తగ్గుతాం.. అలా చేస్తే బరువు తగ్గుతాం అంటూ రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. మనలో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగుతూ కూడా మనం బరువు తగ్గవచ్చు. కాఫీలో టర్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు, బ్రకోలీ కాఫీలు ఉంటాయి. ఇవి హెల్దీ వెయిట్‌లాస్ డ్రింక్ లో ఒకటిగా ఉంటాయి. బ్రకోలీ కాఫీ తీసుకోవడం వల్ల త్వరగా బరువు కూడా తగ్గుతారు. దీని కోసం బ్రకోలీ పౌడర్ చాలా అవసరం. కప్పు పాలని బాగా మరిగించి అందులో కాఫీ పౌడర్, బ్రకోలీ పౌడర్ వేయండి. ఆ డ్రింక్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ బ్రకోలి పౌడర్ మనకు షాపుల్లో దొరుకుంది. లేదంటే ఇంట్లోనే బ్రోకలీని చిన్న ముక్కులుగా తరిగి ఎండలో ఎండబెట్టి పౌడర్ గా చేసుకోవచ్చు. బ్రకోలీలో ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పీచుపదార్థం శరీరంలోని కొవ్వుని కరిగించి బరువును కంట్రోల్‌లో చేయడంలో ఉపయోగపడుతుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. కేలరీలు తక్కువ ఉంటాయి.
నేడు ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్! అందుబాటులో 13 మంది ఆటగాళ్లే
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. అయితే వన్డేల్లో ఎప్పుడూ ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేయని భారత్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతోంది. మొదటి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వన్డే మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. రోహిత్ సహా విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతారు. అలానే రెండో వన్డే ఆడని జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్ నుంచి శుభ్‌మన్ గిల్, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, మొహ్మద్ షమీలకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. ఇక మొహ్మద్ సిరాజ్ మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడతాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లతో కూడిన భారత్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.
రవితేజ నయా మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మూవీ టైగర్ నాగేశ్వరరావు. కొంతకాలంగా మాస్ రాజా నుంచి సాలిడ్ హిట్ పడటంలేదని నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు తో ఫ్యాన్స్ కు అదిరిపోయే కిక్ ఇవ్వనున్నారు రవితేజ.. ఈ సినిమాలో రవితేజ ఫుల్ మాస్ లుక్ లో కనిపించునున్నారు.. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్ ప్రేక్షకులోను మెప్పించాయి. స్టువర్టుపురాని చెందిన ఓ గజదొంగ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని ను తెరకెక్కించారు. ఈ మూవీ కోసం రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లో హీరోయిన్ గా కృతి సనన్ సిస్టర్ నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.. ఇక ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై అంచనాలను పెంచగా.. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేశారు..త్వరలోనే ట్రైలర్ ను రిలీజే చేయనున్నారు. టైగర్ నాగేశ్వరావు ట్రైలర్ ను అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. దాంతో ఈ మూవీ ట్రైలర్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్. టైలర్ అనౌన్స్ మెంట్ తో ఓ పోస్టర్ ను రిలీజే చేశారు. ఇట్స్ టైం టూ రోర్ అంటూ రవితేజ మాస్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.. ఊరమాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ ను అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ పై అంచనాలను పెంచేసింది. టైగర్ నాగేశ్వరావు కు వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970 లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీకృష్ణనాయుడు. ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ టాక్ అందుకుంటుందో చూడాలి.
బూతులతో రెచ్చిపోయిన గౌతమ్.. రతికాకు దండం పెట్టేసిన ప్రశాంత్..
బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది..గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య వాదన కొనసాగింది. ముందుగా గౌతమ్ యావర్ బిహేవియర్ నచ్చట్లేదని, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదని గౌతమ్ నామినేట్ చేసినట్లు తెలిపారు.. అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదంటూ అరిచాడు గౌతమ్. అంతకు ముందు శివాజీ మాట్లాడుతూ ఇవే మాటలు నాగ్ సర్ ముందు ఎందుకు అడగలేదు.. అంటూ శివాజీ గట్టిగానే క్వశ్చన్ చేశాడు. నాది కోపం కాదు.. ఆకలి అని చెప్పాడు.. నాగ్ సర్ కూడా చెప్పారు.. నాకు ఇప్పుడు గుండె ఆగిపోతే… ఇబ్బంది పడితే నేను డాక్టర్ దగ్గరకు వెళ్తానా లేదా తర్వాత వెళ్తాను కదా.. నేను ఏదైనా తప్పు చేస్తే నువ్వు పోయిన వారం నామినేట్ చేయాల్సింది అంటూ యావర్ తన సైడ్ వాదన వినిపించాడు.. కాసేపు వీరిద్దరి వాదన హౌస్ లో రసవత్తంరంగా మారింది.. గౌతమ్, యావర్ వాదన జరుగుతుండగా.. శోభా ముందు నువ్వు చేసిందేంటీ గౌతమ్ అంటూ ప్రశ్నించాడు శివాజీ. ఒక ఆడపిల్ల ముందు షర్ట్ తీసేసావ్ కదా.. అదేంటని అడగ్గా.. మీరు లాయర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒకసైడే మాట్లాడుతున్నారు అంటూ వాదించారు.. ఇక కాసేపు బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది.. ఇక గౌతమ్ బూతులతో రెచ్చిపోయాడు.. శివాజితో గొడవకు దిగాడు.. ఇక రతిక పొట్టి బట్టలు వేసుకుంటే నాకు నచ్చలేదు చెప్పినా అని ప్రశాంత్ చెప్పగా.. నేను ఎట్లా వేసుకుంటే నీకెందుకు అంటూ గొడవకు దిగింది రతిక. సారీ చెప్పితే నేను మాట్లాడినా.. మళ్లీ ఏయ్ అంటూ మాట్లాడతాడు అంటూ నేనెంటీ అని రతిక సందీప్ తో అనగా.. ఇక రతిక అనను.. అక్కా అంటా అంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్..అమర్ దీప్, ప్రశాంత్, తేజ ముగ్గురిలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని జ్యూరీ సభ్యులను ఆదేశించాడు బిగ్ బాస్. ఈ ముగ్గురిలో అమర్ దీప్ ను నామినేట్ చేయాలని సందీప్, శివాజీ చెప్పగా.. నాకు నచ్చలేదంటూ చెప్పుకొచ్చింది శోభా చివరకు తేజను నామినేట్ చేశారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..