Telangana: అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి సోకితే ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. అయితే క్యాన్సర్ చికిత్స ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సామాన్యులు కేన్సర్ బారిన పడితే లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటి వరకు ఎంపిక చేసిన పట్టణాలు, జిల్లాల్లో చికిత్స అందిస్తున్నామని, ఇక నుంచి అన్ని జిల్లాల్లోనూ చికిత్స అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్, వనపర్తి జిల్లా ఆసుపత్రుల్లో కీమోథెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో ఆసుపత్రిలో ప్రత్యేకంగా 100 పడకలను కేటాయించి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన వారు రేడియేషన్, కీమోథెరపీ కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఇక నుంచి నగరానికి రాకుండా జిల్లా ఆస్పత్రుల్లోనే ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే కీమోథెరపీ ఇస్తారు. ఆ తర్వాత ఇతర సేవలను కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Read also: Hyderabad Metro: నగర ప్రజలకు గుడ్‌న్యూస్.. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు
ఇటీవలి కాలంలో ప్రధానంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతోంది. చాలా మంది తమకు క్యాన్సర్ అని తెలియక నాలుగో దశ దాటినా ఆసుపత్రులకు వస్తుంటారు. ఇక నుంచి ఇలాంటి వారికి అన్ని చోట్లా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా స్థాయిలో చికిత్స ప్రారంభించాలని, గ్రామ స్థాయిలో స్క్రీనింగ్‌ను పెంచాలని నిర్ణయించారు. ప్రత్యేక మొబైల్ వాహనం ద్వారా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్క్రీనింగ్‌లు చేపట్టారు. తాజాగా హైదరాబాద్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో రూ.35 కోట్లతో రోబోటిక్ ట్రీట్ మెంట్లు ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో రోబో సహాయంతో ఎలాంటి క్యాన్సర్ కణాలకైనా చికిత్స చేసే అవకాశం ఉంది. వివిధ రకాల రక్త క్యాన్సర్లకు ఎముక మజ్జ మార్పిడి చేస్తారు. గత ఆరు నెలల్లో 30 మందికి ఈ తరహా చికిత్స అందించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జయలత మాట్లాడుతూ.. దక్షిణాది ప్రాంతాల నుంచి క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా ఎంఎన్ జే ఆధ్వర్యంలో జిల్లా దవాఖానల్లో కీమోథెరపీ సేవలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో రేడియేషన్ సేవలను ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 నుంచి 150 మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. చికిత్సలపై సందేహాలుంటే వీడియో కాల్ ద్వారా నివృత్తి చేస్తున్నామని తెలిపారు.
Singareni Elections: అక్టోబర్ లో కష్టం.. నేడు సింగరేణి ఎన్నికలపై వీడనున్న సస్పెన్స్..