తెలంగాణ పాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.
రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు.
CM KCR: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. రేసులో ముందంజలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచార షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.ఈ నెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం…
ప్రకృతిని దేవతగా భావించి ఆరాధించే సాంప్రదాయం కేవలం తెలంగాణాలో మాత్రమే కనిపిస్తుంది. విజయ దశమికి 10 రోజుల ముందు నుండి తెలంగాణా ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
CPM has no relation with BRS Says CPM Leader Tammineni Veerabhadram: తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. దేశంలో కుల గణన పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తుందని, ఇండియా కూటమి మాత్రమే దేశంలో కుల గణన చేయగలదన్నారు. బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీలతో తమకు కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామని వీరభద్రం తెలిపారు.…
Minister Srinivas Goud reacted on High Court Verdict: హైకోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పని గట్టుకొని తనపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారని.. చివరకు న్యాయం, ధర్మమమే గెలిచిందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ఈరోజు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ.. 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల…