Minister Srinivas Goud reacted on High Court Verdict: హైకోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పని గట్టుకొని తనపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారని.. చివరకు న్యాయం, ధర్మమమే గెలిచిందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ఈరోజు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ.. 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించిన తర్వాత.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అది చట్టవిరుద్ధమని, శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న హైకోర్టు.. ఈరోజు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
Also Read: Telangana Elections 2023: మమ్మల్ని కాదని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రాదు: సీపీఐ నారాయణ
హైకోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్టీవీతో మాట్లాడారు. ‘న్యాయం, ధర్మమమే గెలిచింది. పని గట్టుకొని కొందరు నాపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. నా నియోజక వర్గాన్ని మరింత అభవృద్ధి చేస్తా. మళ్లీ గెలుపు నాదే.. ప్రజలు నా వైపే ఉన్నారు. జనాలకు మరింత సేవ చేస్తా’ అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.