CM KCR: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. రేసులో ముందంజలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచార షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.ఈ నెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి నవంబర్ 9వ తేదీ వరకు బీఆర్‌ఎస్ ముఖ్య సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది.
కేసీఆర్ రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనేలా బీఆర్ఎస్ నేతలు షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. ముందుగా హుస్నాబాద్ లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార హోరు మోగించడం గమనార్హం. ఈసారి సభకు భారీ ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి బహిరంగ సభలకు హాజరుకానున్న కేసీఆర్.. ఈ నెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్:
* అక్టోబర్ 15 హుస్నాబాద్
* అక్టోబర్ 16 జనగాం, భువనగిరి
* అక్టోబర్ 17 సిరిసిల్ల, సిద్దిపేట
* అక్టోబర్ 18 జడ్చర్ల, మేడ్చల్
* అక్టోబర్ 26 అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు
* అక్టోబర్ 27 పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్
* అక్టోబర్ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
* అక్టోబర్ 30 జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్
* అక్టోబర్ 31 హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
* నవంబర్ 01 సత్తుపల్లి, ఇల్లెందు
* నవంబర్ 02 నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
* నవంబర్ 03 భైంసా (ముధోల్), ఆర్మూర్, కోరుట్ల
* నవంబర్ 05 కొత్తగూడెం, ఖమ్మం
* నవంబర్ 06 గద్వాల్, మఖ్తల్, నారాయణపేట
* నవంబర్ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి
* నవంబర్ 08 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఒకేరోజు రెండు చోట్ల పోటీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నవంబర్ 9న ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఆచారం ప్రకారం 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు గజ్వేల్‌లో తొలి నామినేషన్, రెండోసారి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
IND vs AFG: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. అందరి కళ్లు వారిపైనే! తుది జట్టు ఇదే