Bathukamma festival : బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనక దాగున్న రహస్యం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma festival: ప్రకృతిని దేవతగా భావించి ఆరాధించే సాంప్రదాయం కేవలం తెలంగాణాలో మాత్రమే కనిపిస్తుంది. విజయ దశమికి 10 రోజుల ముందు నుండి తెలంగాణా ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ వర్షాకాలంలో వస్తుంది. పరుచుకున్న పచ్చదనంలో, హాయిగొలిపే పువ్వుల నవ్వుల్లో, జారే జలపాతపు సడిలో, పారే సెలయేటి హొయల్లో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందమైన ప్రకృతిని చూసిన వాళ్ళ మనసు పరవశిస్తుంది. అలాంటి ఈ సమయంలో దొరికే రకరకాల పువ్వుల్ని ఓ చోట పేర్చి మహిలు అందరూ ఓ చోట చేరి పాటలు పాడి నీటిలో నిమర్జనం చేస్తారు. ఆలా మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడే పాటలు వినడానికి వినసొంపుగా.. చూడడానికి కనుల విందుగా ఉంటుంది. అయితే ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఓ కథ ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని పూర్వం తైలపాడు అనే రాజు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ చోళా కుమారుడు రాజేంద్రచోళ సత్యాస్రాయపై యుద్ధం చేసి విజయం సాధించాడు.
Read also:Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు 18 లక్షలా..!
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
అతను సాధించిన యుద్దానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీనికి కారణం తెలంగాణా ప్రజలు రాజేశ్వరి ఆలయంలోని అమ్మవారిని ఘాడంగా విశ్వసించేవారు. అయితే రాజేంద్రచోళ తండ్రి అయినటు వంటి రాజరాజ చోళా కూడా అమ్మవారి భక్తుడిగా మారాడు. ఈ కారణం చేత యుద్ధం లో విజయం సాధించిన రాజేంద్రచోళ ఆలయాన్ని కూల్చేసి అందులోని శివలింగాన్ని తన తండ్రికి బహూకరించాడు. ఈ విషయం తమిళ శిలాశాసనాల్లో లిఖించబడింది. అయితే వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తీసుకుపోవడంతో తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. దీనితో వాళ్లకు కలిగిన వర్ణనాతీత వేదనను చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా బతుకమ్మ పండుగ మొదలయింది. ఇప్పటికి తెలంగాణా ప్రజలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. పెళ్ళైన మహిళలు ఈ పండుగకు పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేర్చి 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు.
తాజావార్తలు
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!