తెలంగాణలో ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లెటర్ ను నేడు సీఎం కేసీఆర్ కు పంపించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఈసీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం రెడీ అయింది. కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ప్రచార రథం సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది.
Whats Today On 15th October 2023: తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు. అంకూరార్పణ సందర్భంగా సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ మాడ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మహ్సవాల ఏర్పాట్లను పరీశీలించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. నేడు తెలంగాణ భవన్కు సీఎం…
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. గత నెల రోజులుగా అభ్యర్థుల పేర్ల ప్రకటనకు రేపు మాపు అంటూ ఊరిస్తూ.. నేడు తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఇవాళ ప్రకటించనుంది.
తెలంగాణ ప్రజలు మరో రెండు నెలలు ఓపిక పట్టండి.. డిసెంబర్ 9న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. నిర్దిష్టమైన ఆలోచనలతో, ప్రణాళిక బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ఉంటుందన్నారు. మిగతా అభ్యర్థులను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. గెలుపు, విధేయతకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మరోవైపు వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. పొత్తులపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే రేపు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.