తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి వాతావరణం కనబడుతుంది. గత మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. కానీ, రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు చల్లని గాలులు వీస్తున్నాయి.
అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీలో ఏమైనా విభేదాలు, పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలని సూచించారు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.
నేడు మేడిగడ్డకు కేంద్ర జలసంఘం సభ్యులు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ పరిశీలన..
పాక్ ఆర్థిక సంక్షోభం: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్, కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) కష్టాలు తీర్చే పరిస్థితిలో కూడా లేదు. పీఐఏకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ) ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది. పీఐఏ, పీఎష్ఓకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించనిదే, ఇంధనాన్ని సరఫరా చేయనని తెలిపింది. మరోవైపు పీఐఏని ఆదుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం…
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు మునిగిపోయాయి.. ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు.
తిరుమలలో నేటితో ముగియనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ ఉదయం వరాహ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నప్న తిరుమంజనాని అర్చకులు నిర్వహించనున్నారు. ఇక, చక్రతాళ్వార్కీ అర్చకులు పుష్కరిణిలో శ్రీవారికి అవబృద్ద స్నానం చేయించనున్నారు. దీంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇవాళ రాత్రి బంగారు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమల మాడ…
విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు నారా లోకేష్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసే నిరసనల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశాలపై అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు టీడీపీ…
Warangal: సంతోషం వెల్లివిరియాల్సిన పండుగ వేళ ఓ కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పండుగ వేళ కూతురిని అల్లుడుని పిలిచి సారి పెట్టాలనుకున్న కుటుంబం చావు కబురు వినాల్సి వచ్చింది. సంతోషంగా అల్లుడుతో కలిసి రావాల్సిన కూతురు విగత జీవిగా మారింది. తండ్రి కూతురు ఒకేసారి ఈ లోకాన్ని వదిలి అనంతలోకాలకు వెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని మొరిపిరాలకు చెందిన…
52 మందితో బీజేపీ తొలి జాబితా: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీసీలతో పాటు సీనియర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపురావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. హుజారాబాద్తో పాటు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్…