కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పార్టీ మార్పుపై స్పందించారు. ఇప్పటికే లేఖ విడుదల చేశానన్న రాజగోపాల్ రెడ్డి.. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పని చేశానన్నారు. కాంగ్రెస్లో నాయకత్వ ఎంపికలో జరిగిన తప్పుడు నిర్ణయాల వల్లా కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందన్నారు.
బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో కాంగ్రెస్ పేర్కొంది. కేసీఆర్ ఫాంహౌజ్లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రిక విడుదల చేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
ఢిల్లీ పాలకుల చేతుల్లో అధికారం పెడితే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారు అంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో గొప్ప నగరంగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతా.. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరీక్షించే నాయకునికి పట్టం కట్టాలి అని మంత్రి గంగులా కమలాకర్ కోరారు.
నాకు మద్దతు ఇవ్వండి.. 20 ఏండ్లు నల్గొండను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుందాం అని పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే వారికి మాటిస్తున్నాను.. వచ్చే ఐదేళ్లు మీ సేవలో ఉంటా.. ఐదోసారి ఓడిపోయినా.. భువనగిరి ఎంపీగా గెలిపించారు అంటూ కోమటిరెడ్డి తెలిపారు.
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రేపు గజ్వేల్ కు రానున్నారు. గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి నియోజకవర్గానికి రానున్నారు. దీంతో ఆయనకి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట తీవ్రమైన ఎండలు, వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.