Rahul Gandhi: ఢిల్లీలో మీకోసం పోరాడడానికి నేను సైనికుని లాగా ఉన్నానని రాహుల్ గాంధీ అన్నారు. జగిత్యాల కార్నర్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడుతూ.. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. రాహుల్ ఉంటున్న ఇల్లు తీసుకున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు ఆపాలని ఎస్పీలు, కమిషనర్లకు TSLPRB ఆదేశాలు ఇచ్చింది
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల రూట్ మ్యాప్ పై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థుల ఖరారు, అగ్రనేతల నేతల ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చ కొనసాగింది.
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, స్టార్ మా, సీరియల్ నటులు... తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్దకు సందడి చేశారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద ప్రజలకు విసుగు ఉంది అని ఆయన అన్నారు. అపుడు కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలను ప్రజలు మరచిపోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.