Road Accident: వరంగల్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: సంతోషం వెల్లివిరియాల్సిన పండుగ వేళ ఓ కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పండుగ వేళ కూతురిని అల్లుడుని పిలిచి సారి పెట్టాలనుకున్న కుటుంబం చావు కబురు వినాల్సి వచ్చింది. సంతోషంగా అల్లుడుతో కలిసి రావాల్సిన కూతురు విగత జీవిగా మారింది. తండ్రి కూతురు ఒకేసారి ఈ లోకాన్ని వదిలి అనంతలోకాలకు వెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని మొరిపిరాలకు చెందిన వెంకన్న కూతురు అనూష, అల్లుడు రాజేశ్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే దసరాకు కుమార్తెని అల్లుడిని ఇంటికి తీసుకురావాలని ఆశపడ్డారు వెంకన్న.. అయితే అతని ఆశ అడియాస అయింది.
Read also:Cyclone Tej: పెరగనున్న తేజ్ తుఫాను తీవ్రత.. ఈ రాష్ట్రానికి ముప్పు
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
కూతురుని అల్లుడిని తీసుకు రావడానికి హైదరాబాద్ వెళ్లిన వెంకన్న.. కూతురుని అల్లుడిని హైదరాబాద్ నుంచి మెరిపిరాలకు తీసుకు వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైయ్యారు. రాయపర్తి మండలం కిష్టాపురం సమీపానికి రాగానే వాళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న అతని కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా రాజేష్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు రాజేష్ ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకి సమాచారం అందిచారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కార్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!