రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు.. నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు, నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇయ్యు, నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు, నిన్న ( బుధవారం ) మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది
బీజేపీ పార్టీ వాళ్లు కావాలని గొడవలు చేశారు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొ్న్నారు. దేవరకోట ఆలయ ఈవోని బెదిరించి అసభ్య పదజాలంతో దూషించారు అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పారు.
నాగర్ కర్నూల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. ఎలక్షన్లు రాగానే ఆగం కావొద్దు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు, కరెంట్ ఇస్థలేరని కర్ణాటక రైతులు గద్వాల, కొడంగల్ లో ఆందోళన చేస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకుడు.. రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు చివరి క్షణంలో టికెట్ చేజారింది.. అధిష్టానం సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ పథకాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఏడు సంవత్సరాల నుంచి అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు ఈ ఎన్నికలు.. ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఎన్ని సమీకరణాలు మారుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు.. రైతులు, మహిళలను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.. మైనార్టీల ఓట్లు డివైడ్ కావడం వల్ల ప్రజలకు నష్టం.. కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆట.. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోంది అని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.
Rajagopal Reddy: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోన్ చేసింది. ఢిల్లీకి రావాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు.