Rajagopal Reddy: నేడు న్యూఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajagopal Reddy: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోన్ చేసింది. ఢిల్లీకి రావాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కూడా ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. కాగా.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌పై కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డి ఫోన్ చేశారు. ఈరోజు ఢిల్లీకి రావాలని కోరారు. అది కుదిరితే ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. కుదరని పక్షంలో రేపు కాంగ్రెస్‌లో చేరనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు కోసం ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. నిన్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరిగింది. నిన్నటి సమావేశంలో 40 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. వామపక్షాలతో పొత్తు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నేతలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15న తొలి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. కానీ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉండడంతో అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ ఫిదా అవుతోంది. మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ సీనియర్లను బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తోంది. మునుగోడుతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఈ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పార్టీ అధిష్టానం చర్చించనుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ను కూడా న్యూఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం కోరింది.
They Call Him OG: పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ సంభవం లోడింగ్…
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!