నాగర్ కర్నూల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. ఎలక్షన్లు రాగానే ఆగం కావొద్దు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు, కరెంట్ ఇస్థలేరని కర్ణాటక రైతులు గద్వాల, కొడంగల్ లో ఆందోళన చేస్తున్నారు.. కేసీఆర్ దమ్ము దేశం అంతా చూస్తుంది.. నవంబర్ 30 నాడు దుమ్ము లేవాలి అని కేసీఆర్ అన్నారు.
Read Also: PM Modi: షిర్డీలోని సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థనలు
అచ్చంపేటలో బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కేసీఆర్ దమ్మేంటో దేశం మొత్తం చూసిందంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. తెలంగాణ కోసం నేను బయలుదేరి 24 ఏళ్లు పూర్తైంది అన్నారు. తెలంగాణ ఈరోజు మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తోంది అని ఆయన చెప్పారు. నేను ఎన్నికల కోసం ఏ పథకం తీసుకు రావడం లేదని కేసీఆర్ అన్నారు. కేవలం ప్రజల కోసం చేస్తున్నాను.. ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇయ్యను.. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతోంది.. 24 గంటల కరెంట్ ఇస్తామంటే అసెంబ్లీలో పెద్దలు జానారెడ్డి గజమెత్తు లేచిండు.. తెలంగాణ వచ్చిన రెండేళ్లలోనే 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించామని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు.
Read Also: RGV: రాజమండ్రి జైలుకు వర్మ.. లోపల బాబు బయట నేను!
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది అని సీఎం కేసీఆర్ అన్నారు. పెన్షన్‌ను వందల నుంచి వేలల్లోకి తీసుకెళ్లింది కేసీఆరే.. కాంగ్రెస్ నేతలకు కావాల్సింది తెలంగాణ బాగోగులు కాదు.. పెత్తనం మాత్రమేనంటూ ఆయన చురకలు అంటించారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో మంచినీళ్లకు కూడా దిక్కులేదు.. కాంగ్రెస్ వాళ్లు వస్తే ధరణి తీసేస్తామని అంటున్నారు. ధరణితో రైతుల భూముల లెక్కలు ప్రభుత్వం దగ్గర సేఫ్ గా ఉన్నాయని కేసీఆర్ అన్నారు.