రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ మునుపెన్నడూ చూడనిది..
మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా మునుపెన్నడూ చూడనిది అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికార పక్షం వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రపై ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ నాలుగేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్రలో ఎలుగెత్తి చాటాలని, తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు.. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టంకట్టిన ప్రభుత్వంకూడా మనదే అన్నారు సీఎం జగన్.. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. రాబోయే రోజుల్లోకూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. ఈరోజు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “సామాజిక సాధికార యాత్ర’’ ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలి.. పేదవాడి విజయానికి బాటలు వేయాలి. దాదాపు 60 రోజులకు పైగా సామాజిక సాధికర బస్సు యాత్రలు జరుగుతాయని.. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయి.. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తారని.. ప్రతీ రోజు సాయంత్రం ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తాం అన్నారు.. ఈ సభలకు స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు.. నేతల ఉపన్యాసాలు ఉంటాయని వెల్లడించారు.. ఇది మామూలు బస్సు యాత్ర కాదు.. ఒక సామాజిక న్యాయ యాత్ర.. పేద సామాజిక వర్గాలను కలుపుకుపోయే యాత్ర.. పేదల పక్షాన నిలబడే యాత్ర.. అని పేర్కొంటూ..#SamajikaSadhikaraYatra హాష్ ట్యాగ్‌ను జత చేసి తన ఉపన్యాసాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు.. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చిక్కబళ్లాపూర్ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 13 మంది వలస కూలీలు దుర్మరణం చెందడం ఆవేదన కలిగించిందన్న ఆయన.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పేద కుటుంబాలకు చెందిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని.. తగినంత నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసిన పవన్.. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గోరంట్ల ప్రాంతానికి చెందిన వలస కూలీలు ఉపాధి కోసం కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం జరగడం.. అందులో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. తమ ప్రాంతంలోనే వారికి ఉపాధి అవకాశాలు లభించి ఉంటే.. మన రాష్ట్రానికి చెందిన వారు.. పొరుగు రాష్ట్రాలకు వలసపోయే అవసరం ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఎలక్షన్లు రాగానే ఆగం కావొద్దు.. కేసీఆర్ దమ్ము దేశం అంతా చూస్తుంది.. నవంబర్ 30న దుమ్ము లేవాలి
నాగర్ కర్నూల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. ఎలక్షన్లు రాగానే ఆగం కావొద్దు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు, కరెంట్ ఇస్థలేరని కర్ణాటక రైతులు గద్వాల, కొడంగల్ లో ఆందోళన చేస్తున్నారు.. కేసీఆర్ దమ్ము దేశం అంతా చూస్తుంది.. నవంబర్ 30 నాడు దుమ్ము లేవాలి అని కేసీఆర్ అన్నారు. అచ్చంపేటలో బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కేసీఆర్ దమ్మేంటో దేశం మొత్తం చూసిందంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. తెలంగాణ కోసం నేను బయలుదేరి 24 ఏళ్లు పూర్తైంది అన్నారు. తెలంగాణ ఈరోజు మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తోంది అని ఆయన చెప్పారు. నేను ఎన్నికల కోసం ఏ పథకం తీసుకు రావడం లేదని కేసీఆర్ అన్నారు. కేవలం ప్రజల కోసం చేస్తున్నాను.. ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇయ్యను.. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతోంది.. 24 గంటల కరెంట్ ఇస్తామంటే అసెంబ్లీలో పెద్దలు జానారెడ్డి గజమెత్తు లేచిండు.. తెలంగాణ వచ్చిన రెండేళ్లలోనే 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించామని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కు భారీ షాక్.. రేపు బీజేపీలో చేరనున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మీతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు మరియు నన్ను మీ కుటుంబంలో ఒక్కడిగా ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం లేఖలో పేర్కొన్నారు. కానీ, గత పది సంవత్సరాల నుంచి నాకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ మీ మీద గౌరవంతో ఒక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతూ వచ్చాను.. కానీ మీరు చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి ఎన్నిక చేయడం పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం నాకు చాలా బాధ కలిగించింది.. నేను చేవెళ్ల నియోజకవర్గం ప్రజల కోసం వాళ్ళ కోరిక మేరకు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయదలచుకున్నాను.. కావున పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
షిర్డీలోని సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థనలు
మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని నీల్వాండే డ్యామ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జల పూజ చేశారు. అనంతరం ఆనకట్ట ఎడమ గట్టుకు సంబంధించిన కాలువ నెట్‌వర్క్‌ను ఆయన ప్రారంభించారు. దీనికి ముందు ఆయన షిర్డీలోని ప్రసిద్ధ శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రార్థనలు చేశారు. దీని తర్వాత కొత్త ‘దర్శన్ ఖతార్ కాంప్లెక్స్’ను ప్రారంభించడం ద్వారా ఆయన మహారాష్ట్ర పర్యటనను ప్రారంభించారు. రూ. 7,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులతో పాటు 86 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూర్చే ‘నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ఈ రోజు సాయంత్రం 37వ జాతీయ క్రీడలను ప్రారంభించేందుకు గోవాకు వెళ్లనున్నారు.
ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్తాన్ మరో వార్నింగ్.. నవంబర్ 1 డెడ్‌లైన్..
వేల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ వదిలివెళ్లాలని లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులందరూ.. నవంబర్ 1 కంటే ముందే దేశం నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ గురువారం చివరిసారిగా హెచ్చరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలోని అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. నవంబర్ 1 తర్వాత పత్రాలు లేని వలసదారులందరిని తొలగించే ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది. పాకిస్తాన్ లో ఇటీవల జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాలు, బాంబు పేలుళ్లలో ఆఫ్ఘన్ జాతీయులు ఉన్నారని తేలడంతోనే ఈ నిర్ణయం తసుకున్నట్లు దాయాది దేశం పేర్కొంది. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించామని, గడువులోగా స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని మంత్రి బుగ్తీ మరోసారి చెప్పారు. గడువు ముగిసిన తర్వాత అక్రమవలసదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ చేపడుతుందని అన్నారు. వలసదారులను దాచిపెట్టడంలో ప్రేమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
బాబర్ ఆజం కెప్టెన్సీ ఊడుతుందా?.. పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో జట్టు విఫలమైతే బాబర్ అజామ్ కెప్టెన్సీకి ప్రమాదం వాటిల్లుతుందని సూచిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఒక విచిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023లో ఇండియా, ఆస్ట్రేలియ, అఫ్గానిస్తాన్‌లతో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇండియా చేతుల్లో ఓటమితోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కెప్టెన్ బాబర్ ఆజం.. అఫ్గానిస్తాన్‌తో ఓటమి తర్వాత మరింత ఒత్తిడిలో పడిపోయాడు. మాజీ క్రికెటర్లు, అక్కడి మీడియా అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అంతేకాదు ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ సమయంలో జట్టుకు మద్దతుగా నిలవాలని అభిమానులను కోరుతూనే.. బాబర్ ఆజంకు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది. కెప్టెన్ బాబర్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్-ఉల్-హక్‌లకు ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసే స్వేచ్ఛ ఇచ్చామని పీసీబీ స్పష్టం చేసింది. “కెప్టెన్ బాబర్ ఆజం, టీమ్ మేనేజ్‌మెంట్ పై మీడియా స్క్రూటినీని ఉద్దేశించి ఈ ప్రకటన జారీ చేస్తున్నాం. ఆటలో గెలుపోటములు సహజమన్న మాజీ క్రికెటర్ల మాటతో ఏకీభవిస్తున్నాం. వరల్డ్ కప్ 2023 టీమ్ ఎంపిక కోసం కెప్టెన్ బాబర్ ఆజం, చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్‌లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. వరల్డ్ కప్ లో టీమ్ ప్రదర్శన చూసిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడైతే అందరూ టీమ్‌కు అండగా నిలవండి. వాళ్లు ఈ మెగా ఈవెంట్లో మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తున్నారు” అని పీసీబీ ఆ ప్రకటనలో వెల్లడించింది. రల్డ్ కప్ లో ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ సెమీఫైనల్ చేరితేనే బాబర్ కెప్టెన్సీ ఉంటుందని, లేదంటే అతడు కేవలం టెస్ట్ క్రికెట్‌కే పరిమితమవుతాడని పీసీబీ వర్గాలు తెలిపాయి.
అరటిపండు కనుమరుగు..? శాస్త్రవేత్తల హెచ్చరిక
అరటిపండుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. భవిష్యత్‌లో అరటిపండు కనుమరు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.. ప్రజలు ఎంతో ఇష్టంగా తినే అరటి పండ్లలో కావెండిష్ అరటిపండ్లు రకం ఒకటి కాగా.. ఇది వాణిజ్యం పరంగానూ అధికంగా ఎగుమతి చేస్తుంటారు.. అయితే.. ఆ అరటిపండుకే ఇప్పుడు కష్టం వచ్చింది.. ఈ అరటిపండ్ల చెట్లకు పనామా అనే ఉష్ణమండల జాతికి చెందిన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతోంది.. ఈ ఇన్ఫెక్షన్ చెట్టు మూలల్లో దాడి చేసి నాశనం చేస్తుంది.. ఇది ఒక్కసారి చెట్టుపై దాడి చేసిందంటే.. ముందుగా ఆ మొక్క నీటిని గ్రహించే శక్తి కోల్పేయేలా చేస్తుంది.. తద్వారా కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేని స్థితిలోకి వెళ్లిపోతోంది.. చివరకు ఆ మొక్క నశిస్తుంది.. దీంతో.. ఈ కావెండీష్ రకం అరటిచెట్లు అంతరించిపోవడం.. తద్వారా ఆ అరటిపండ్లు కనుమరు అయ్యే ప్రమాదం పొంచిఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇంటిమేట్ సీన్.. నటుడ్ని చెంప దెబ్బ కొట్టిన జయప్రద.. అతడేమన్నాడంటే..?
అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులోనే కాదు.. హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆమె గురించి గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక అందులో ఒకటి.. ఒక బాలీవుడ్ నటుడును జయపరదా చెంపదెబ్బ కొట్టిందని. అతను ఎవరో కాదు బాలీవుడ్ నటుడు దాలిప్ తాహిల్. బాలీవుడ్ లో స్టార్ నటుడుగా కొనసాగుతున్న ఆయన.. జయప్రద తో ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఆమె చెంప దెబ్బ కొట్టిందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆ వార్తలపై బాలీవుడ్ నటుడు దాలిప్ తాహిల్ స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జయప్రద తనను చెంపదెబ్బ కొట్టిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. “జయప్రద అంటే నాకెంతో గౌరవం. ఆమె ఒక అందమైన నటి. ఓ సినిమా సెట్‌లో ఆమె నాపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వచ్చిన వార్తలు చూసి నేను ఆశ్చర్యపోయా. ఇంతకీ ఆ సంఘటన ఏ సినిమా సెట్‌లో చోటుచేసుకుందో చెబితే నేను కూడా తెలుసుకుంటా. ఎందుకంటే నేను ఇప్పటి వరకూ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్నదే లేదు. కెరీర్ ఆరంభం నుంచి నేను ప్రతినాయకుడి పాత్రల్లోనే ఎక్కువగా నటించా. అందువల్ల అత్యాచారం సన్నివేశాలు నాతో చిత్రీకరించేవారు. అలాంటి సీన్ ఏదైనా ఉంటే.. నాతోపాటు హీరోయిన్‌కి కూడా ముందే చెప్పమనేవాడిని. వాళ్లు ఓకే అంటేనే ఆ సీన్‌లో నటిస్తానని.. లేకపోతే చేయనని చెప్పేసేవాడిని. ఒకవేళ దర్శకుడు బలవంతం చేస్తే సెట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించేవాడిని.. నేనెప్పుడూ ఆమెతో నటించలేదు ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
రాజమండ్రి జైలుకు వర్మ.. లోపల బాబు బయట నేను!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసేవాడు కానీగత కొంతకాలంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు తీయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు వ్యూహం, శపథం అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. వర్మ తన సినిమాలతో ఎంత కలకలం సృష్టిస్తారో, తన వ్యాఖ్యలు, చర్యలతో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ వెలుపల పోలీసులు జనాన్ని కంట్రోల్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసిన చోట వర్మ సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసి “రాజమండ్రి సెంట్రల్ జైలుతో ఓ సెల్ఫీ. నేను బయట… ఆయన(చంద్రబాబు) లోపల” అంటూ తన ఫొటో పై కామెంట్ చేశారు.