నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే క్రీడా సంబరంలో క్రికెట్,…
నేడు కృష్ణా జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించనున్నారు. పామర్రు బెల్ పరిశ్రమ పరిశీలన, జిల్లా కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొననున్నారు. నేడు అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాంను విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కొవ్వూరు టౌన్లో…
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన తాజా బులిటెన్లో వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య దాదాపు 8 లక్షల 44 వేల 558కి చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జీరో టికెట్లు ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మా కమిట్మెంట్ ఎలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది.. అసెంబ్లీలో మేము శ్వేత పత్రం విడుదల చేశాం.. కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంలో ఔటర్ రింగ్ రోడ్డు కట్టినట్లు ఫోటో పట్టుకున్నారు.. ఔటర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాసన సభలో ప్రవేశ పెట్టాం.. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టేశారు.. కేటీఆర్ ఓటమిని జీర్ణించుకోలేక స్వేద పత్రం పేరిట తప్పుడు లెక్కలు చెప్పారు.. స్వేద పత్రం కాదు, ప్రజల చెమటతో స్వేద సోధ భవనాలు నిర్మించారు.. బిఆర్ఎస్ నేతల ఆర్థిక పరిస్థితి స్వేద పత్రం విడుదల చేయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా మత్తు పదార్థాలను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. అయితే, తెలంగాణలో జోరుగా ఆల్ప్రాజోలం అనే డ్రగ్ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు 66 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ వాయిదా పడింది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.