Corona Cases: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య దాదాపు 8 లక్షల 44 వేల 558కి చేరింది. కొత్తగా ఒకరు రికవరీ అయినట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8 లక్షల 40 వేల 392కి చేరింది. కొత్తగా ఎవరూ మరణించలేదు.. మొత్తం మరణాల సంఖ్య 4, 111గా ఉంది.
Read Also: Himachal Pradesh: పర్యాటకులతో మనాలిలో భారీ ట్రాఫిక్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్
ఇక, తెలంగాణ రాష్ట్రంలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 55 ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో కొత్త కరోనా JN.1 వేరియంట్ కేసులు 2 నమోదు అయినట్లు చెప్పారు. నిన్న 989 మందికి టెస్టులు చేశారు.. మొత్తం టెస్టుల సంఖ్య 3 కోట్ల 91 లక్షల 77 వేల 325కి చేరింది. 12 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.