న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బీజేపీ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది అంటూ విమర్శలు గుప్పించారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అని పేర్కొన్నారు.
వ్యాంగులకు గత ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కేసీఆర్.. జిల్లాలో కేంద్రంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే రైస్ మిల్లర్లుపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
దేశంలో బడుగుబలహీన వర్గాలకు న్యాయం చేసేలా పాలన కొనసాగించారు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పధకంతో లక్షలాది గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించారు.. ప్రధాన మంత్రి స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం లో అనేక జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అందిస్తామనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత వ్యవస్థలో తప్పులు జరిగాయని, వాటిని తాము సరిదిద్దుతామన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త నడవడికలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చారు. Also Read: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్…
Ministers To Visits Medigadda Barrage on December 29: డిసెంబర్ 29న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు బయల్దేరి.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలను గురించి మంత్రులు వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు…