Drugs: తెలంగాణలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. కీలక సూత్రదారి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో భారీగా మత్తు పదార్థాలను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. అయితే, తెలంగాణలో జోరుగా ఆల్ప్రాజోలం అనే డ్రగ్ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు 66 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కో గ్రాము 10 వేల రూపాయలకు డ్రగ్స్ ముఠా అమ్మకాలు చేసింది. గడిచిన రెండేళ్లలో తెలంగాణలో 43 కేసులను టీఎస్ న్యాబ్ నమోదు చేసింది. ఇక, 3.14 కోట్ల రూపాయల విలువ చేసే ఆల్ప్రాజోలంను డీఆర్ఐ సీజ్ చేసినట్లు ప్రకటించారు. పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్ కుమార్, లింగయ్య గౌడ్ నుంచి 70 కేజీల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో గచ్చి బౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు.
Read Also: MP Margani Bharat: అప్పుడు బందిపోటు.. ఇప్పుడెలా అవసరమయ్యారు?
Also Read
అయితే, ఢిల్లీ నుంచి 34 కేజీల మత్తు పదార్థాలను నరసింహ తీసుకొచ్చినట్లు న్యాబ్ గుర్తించింది. ఆల్ప్రా జోలం డ్రగ్ ను పలు ఫ్యాక్టరీలలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ లో నరసింహ గౌడ్ ఉన్నాడు.. ఢిల్లీ నుండి మెట్రో కొరియర్ సర్వీస్ లో మత్తు పదార్థాలు తరలింనట్లు గుర్తించారు.. వీటి కోసం నరసింహా హవాలా మార్గాన్ని ఎంచుకున్నాడని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. కేజీ ఆల్ప్రా జోలం 2.4 లక్షల రూపాయలకు నరసింహా కొనుగోలు చేసి.. వాటిని హైదరాబాద్ లో 3.5 లక్షల రూపాయలకి అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి నెల 40 కేజీలకు పైగా మత్తు పదార్థాలను అమ్ముతున్నట్లు వారు చెప్పారు. నర్సింహ గౌడ్ తో పాటు అతని కుమారుడు రాజశేఖర్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాల ద్వారా వచ్చిన డబ్బుతో భారీగా నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులు ఆస్తులు కూడబెట్టారు.. ఇప్పటికే అతడిపై పలు కేసులు ఉన్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!