Konda Vishweshwar Reddy Face To Face: తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. కాకపోతే.. కాంగ్రెస్ కంటే బీజేపీయే మరింత ముందు ఉందన్నారు.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ ‘ఫేస్ 2 ఫేస్’లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీయే ముందుంది.. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వాళ్లే.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వేస్తామని చెప్పారని తెలిపారు. తాను పోటీ చేయనున్న చేవెళ్ల లోక్‌సభ స్థానంతో పాటు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు.
Read Also: Sai Pallavi: ఆ విషయంలో అక్కనే మించిపోయావ్ గా పూజా.. నెక్స్ట్ లెవెల్ అంతే
ఇక, ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ లాంటి వాళ్లు గెలవడానికి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బాగా పనిచేసిందన్నారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు మొత్తం ప్రేమతో వేసినవి కావు.. బీఆర్ఎస్‌ను బొందపెట్టడానికే కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేశారని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు.. ఇప్పుడున్న పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోవడంలేదు.. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటే ఎవరైనా? నమ్ముతారా? కేటీఆర్.. అమెరికా నుంచి వచ్చాడు.. చిన్న పిల్లాడు అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో సక్యతతో ఉన్నప్పుడే.. తెలంగాణలో పాలన సాగుతుందన్నారు. ఇక, మేడిగడ్డ రిపేర్ చేసి వేస్ట్ అంటున్నారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..