Pakistan: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక భారత పర్యటన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఇది జియోపాలిటిక్స్‌లో భాగంగా చోటు చేసుకున్నట్లు అంతర్జాతీయ అంశాల నిపుణులు చెబుతున్నారు. ఇస్లామాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించాలనే తన ప్రణాళికను యూఏఈ రద్దు చేసుకుంది. ఆగస్టు 2025 నుంచి రెండు దేశాల మధ్య చర్చల్లో ఉన్న అంశం నుంచి యూఏఈ వెనక్కి తగ్గింది.
Read Also: T20 World Cup 2026: అయ్యో అయ్యయ్యో సంజు శాంసన్.. ఇక అంతే సంగతులు, ఇషాన్‌కు ప్లేస్ ఫిక్స్!
ఈ ప్రాజెక్టుపై ఆసక్తి తగ్గిందని, స్థానిక భాగస్వామిని ఎంపిక చచేయడంలో విఫలమైందని పేర్కొంటూ యూఏఈ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు పాకిస్తాన్ పత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదికింది. అధికారికంగా కారణాలు ప్రస్తావించకపోయినా, ఈ పరిణామాన్ని చూస్తే ఇందుకు భారత్-యూఏఈ మధ్య బలపడుతున్న బంధమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే సమయంలో గల్ఫ్ పరిణామాలు కూడా కారణమవుతున్నాయి. యెమెన్‌లో అధికారం కోసం సౌదీ అరేబియా, యూఏఈ రెండు కూటములకు మద్దతు ఇస్తున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఒకింత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు, సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. టర్కీ కూడా ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆకాంక్షిస్తుంది. ఇస్లామిక్ నాటో కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో ఉంది. దీంతో యూఏఈ-భారత్ మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది.