నేడు సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలల్లో పర్యటించనున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఫుడ్ ఫార్క్ ను, అశ్వారావుపేట లో ఆయిల్ ఫాం ఫాక్టరీ లను పరిశీలించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
నేడు ఆందోల్ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న మాజీ మంత్రి హరీశ్ రావు.. అలాగే, నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో జగిత్యాల నియోజక వర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న హరీశ్ రావు..
నేడు నేడు తిరుపతిలో వైసిపి సన్నాహక సమావేశం.. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అధ్వర్యంలో రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కో ఆర్డీనేటర్లతో భేటీ.
నేడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పై సుప్రీం కోర్టులో విచారణ.. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ మంజూరీ చేసిన హైకోర్ట్ .. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ఏపీ ప్రభుత్వం..
నేడు సాలూరు డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో వైయస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమం హాజరు.అవుతున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.
నేడు వైఎస్ఆర్ ఆసరా పంపిణీల్లో పాల్గొననున్న మంత్రి బొత్స.. జిల్లాలో పర్యటన.. చీపురుపల్లి కనక దుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న మైదానంలో వైఎస్ఆర్ ఆసరా మొత్తాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు..
నేటి నుంచి గుంటూరు మిర్చి యార్డులో రైతులకు ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించనున్న పాలకవర్గం.. హాజరుకానున్న మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , విడదల రజినీ, అంబటి రాంబాబు.
నేడు గుంటూరు జిల్లాచేబ్రోలు మండలం క్వారీ సమీపంలో టీడీపీ అధ్వర్యంలో రా కదలిరా బహిరంగ సభ.. హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మేటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిములపు సురేష్.. మర్రిపూడిలో వైసీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
నేడు కంభంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి గిద్దలూరు వైసీపి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటూ ఆయన వర్గీయుల మీడియా సమావేశం..
నేడు కొనకనమెట్లలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి..
నేడు మార్టూరు మండలం ద్రోణాదులలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న పర్చూరు వైసీపీ ఇంచార్జీ ఆమంచి కృష్ణ మోహన్..
నేడు అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం.. చైర్మన్ అధ్యక్షతన 20 అంశాలపై చర్చించనున్న సభ్యులు.. మాఘమాసం, భీష్మ ఏకాదశికి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.
నేడు ఏలూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన.. 3వ తేదీన ఏలూరులో జరిగే “సిద్ధం” సభ స్థలాన్ని పరిశీలించనున్న మిథున్ రెడ్డి..
నేడు నుంచి విద్యుత్ చార్జీలపై ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ.. నాలుగు రోజుల పాటు వర్చువల్ విధానంలో అమలు చేయనున్న విద్యుత్ నియంత్రణ మండలి..
నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు వెంకటగిరిలో టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న మంత్రులు సురేష్.. నారాయణస్వామి.
నేడు నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలతో జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సమావేశం.
నేడు ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 2024-25 వార్షిక బడ్జేట్ కి ఆమోదం తెలుపనున్న పాలకమండలి.. 5 వేల కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జేట్ ప్రవేశపెట్టనున్న టీటీడీ.. గత ఏడాదితో పోలిస్తే తగ్గిన 100 కోట్ల రూపాయల హుండి ఆదాయం.. పెరిగిన వడ్డి,ప్రసాదాల విక్రయాలు,వసతి గదులు కేటాయింపుపై వచ్చే ఆదాయం..
నేడు విజయవాడలో దుర్గగుడి పాలకమండలి సమావేశం..
నేడు యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో, డివిజన్ , మండల స్థాయి స్పందన.. కలెక్టర్ డా కే.మాధవీలత.. ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరణ.