దేశమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు.. వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళనున్న సిబ్బంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 29.79 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో 17 లక్షల 97 వేల150 మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలో ప్రచార పర్వం ముగిసింది. ఇక 13న జరిగే పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు…
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దంమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక, ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు.
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలి సారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
Right to Vote: ఐదేళ్లపాటు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించే సమయం ఆసన్నమైంది. మే 13 సోమవారం పోలింగ్ జరగనుంది.
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.."నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే.