బీజేపీ కొత్త శక్తిగా తెలంగాణలో అవతరిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఓటు వేసిన ప్రజలకు, అధికారులకు, రాజకీయపార్టీల కార్యకర్తలకు, మీడియాకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది.. పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. బీజేపీకి సానుకూల వాతావరణ కనిపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారని పేర్కొన్నారు.
తెలంగాణలో కాసేపట్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఓటేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాల గురించి మాట్లాడారని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
లోక్సభ ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్లిన ఓ మహిళ గుండె పోటుతో మృతి చెందింది. భరత్ నగర్కి చెందిన విజయ లక్ష్మి.. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారు. పోలింగ్ సిబ్బంది, స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో విజయ లక్ష్మి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు.
CM Revanth Reddy Cast his Vote: ఓటు వేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు వెళ్లారు. జిల్లా పరిషత్ స్కూలులోని పోలింగ్ కేంద్రంలో రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం సతీమణి, ఆయన కూతురు కూడా కొడంగల్లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి తన వేలిని మీడియాకి చూపించారు. ఆపై అక్కడి స్థానికులతో సీఎం మాట్లాడారు. తాను ఓటు వేశానని, అందరూ తమ ఓటు హక్కును…