Right to Vote: ఐదేళ్లపాటు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించే సమయం ఆసన్నమైంది. మే 13 సోమవారం పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతుండగా, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు స్వగ్రామాలకు వెళ్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలు నిలిచిపోవడంతో.. కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read also: Election ink: ఎన్నికల సిరాను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..?
ఓటు వేసేందుకు వెళ్లే వారికి అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఓటు వేసే సమయంలో ఇలాంటి పనులు చేస్తే జైలుకు వెళ్లడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఏపీ, తెలంగాణలో మే 13న సోమవారం పోలింగ్ జరగనుంది. హైదరాబాద్‌లో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అలాగే ఓటు వేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Read also: Rajamouli : నా కెరీర్ లో ఆ సినిమా చేసిన మ్యాజిక్ ఎప్పటికి మర్చిపోలేను..
పోలింగ్ బూత్ వద్ద..
* పోలింగ్ బూత్ దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
* పోలింగ్ బూత్ దగ్గర ఎలాంటి ప్రచారం చేయకూడదు.. అల్లర్లు సృష్టించకూడదు.
* పోలింగ్ బూత్‌లోకి మొబైల్, కెమెరాలు వంటివి తీసుకెళ్లకూడదు.
* పోలింగ్ బూత్‌లో ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కలిగించవద్దు.
* మద్యం తాగి పోలింగ్ బూత్‌లోకి వెళ్లొద్దు.
* ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి.
* ఇతరులకు ఓటు వేయడానికి ప్రయత్నించకూడదని.. అలా చేస్తే కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెబుతున్నారు.
Read also: Delhi : ఢిల్లీలో తుఫాను, వర్షం విధ్వంసం.. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు
ఓటరు ఇలా చేస్తే నేరం.
* ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకూడదు.
* సెల్ ఫోన్ తీసుకుని పోలింగ్ బూత్ కు వెళ్లడం మర్చిపోయినా స్విచ్ఛాఫ్ చేసి అధికారులకు ఇవ్వండి.
* ఓటు వేసేటప్పుడు ఫోటోలు తీయకండి.
* ఏ పార్టీకి ఓటు వేశారో బయటపెట్టడం కూడా నేరమే.
* మీరు ఓటు వేసేటప్పుడు ఎవరైనా ఫోటో లేదా వీడియో తీస్తే, మీరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
* ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే పోలింగ్ బూత్ నుండి బయటకు వెళ్లాలి.
* కావాలనే చాలా సేపు అక్కడే నిలబడ్డా.
* ఓటుకు నోట్లు తీసుకోవడం నేరం.. ఎవరైనా డబ్బులు తీసుకుని ఓటు వేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Read also: KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా..
దొంగ ఓటు వేస్తే..
* ఓటరు జాబితాలో పేరు ఉన్న వ్యక్తికే ఓటు వేయాలి.
* ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తికి బదులు వేరే వ్యక్తి ఓటు వేస్తే వారిపై కేసు నమోదు చేస్తామన్నారు.
* దొంగ ఓట్లు వేయడం చట్టరీత్యా నేరం.
* అలాగే ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయడం నేరంగా పరిగణిస్తారు.
* ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వేయాలి.
* ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఒక ఓటు మాత్రమే వినియోగించాలి.
* రెండు చోట్ల ఓటేస్తే ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటారు.
* పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలన్నారు.
Election ink: ఎన్నికల సిరాను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..?