PM Modi: ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణలో బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 80-90లో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో అదే విధంగా తెలంగాణలో కూడా జరుగుతోందని ప్రధాని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అన్నారు. ఇక్కడ ప్రజలు తక్కువ సయమంలోనే ప్రజలు నిరాశలో పడిపోయారని అన్నారు.…
తెలుగు న్యూస్ ఛానెళ్ల చరిత్రలోనే తొలిసారిగా ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తోంది ఎన్టీవీ.. తన మనసులోని మాటను మోడీ ఎన్టీవీతో పంచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఎన్నో అంశాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ..
నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తన ఎక్స్(గతంలో ట్విట్టర్) అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
Bandi Sanjay: నీ గడీలు బద్దలు కొట్టిం..నీ మెడలు వంచి..నీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది నేనే అంటూ కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి విమర్శలతో అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రానున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో.. అలాగే, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.