ఆంధ్రప్రదేశ్ తీర్పు వైవిధ్యమైందని.. ఈ ఫలితాలను తాము ముందే ఊహించామని మంత్రి కొండా సురేఖ అన్నారు. కక్షపూరితమైన పాలన తోనే జగన్ ను ఓటమిపాలయ్యారని విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడే ప్రజలు చంద్రబాబును గెలిపించాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమన్నారు. అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధిని కోరుకున్న జనం చంద్రబాబును గెలిపించారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కక్షపూరితంగా వ్యవహరించొద్దన్నారు. దేశంలో ఇండియా కూటమికి మంచి సీట్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. కడియం కావ్య అత్యధిక మెజార్టీతో గెలవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేలు నాగరాజు, కడియం శ్రీహరి, సత్యనారాయణ, నాయిని రాజేందర్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎంపీగా గెలుపొందిన కడియం కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
READ MORE: YS JAGAN: సీఎం పదవికి జగన్ రాజీనామా.. గవర్నర్ కు లేఖ
కాగా.. వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎంపీ ఎన్నికల ఫలితాలలో తాము ఊహించిన మెజారిటీ రీచ్ అయ్యామని కడియం కావ్య అన్నారు. డాక్టర్ గా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. ప్రజాప్రతినిధిగా మరింత రాణించడానికి దోహదపడుతుందని తెలిపారు. మొదటి నుంచి మహిళల సమస్యల కోసం కడియం ఫౌండేషన్ ద్వారా పనిచేశానని చెప్పారు. తనను ఎంపీగా గెలిపించిన వరంగల్ పార్లమెంటు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.