నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో 8 ట్రాక్‌లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఒలంపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చిన ఘనత నిజామాబాద్‌కు ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..
విజయవాడను వీడని వాన ముప్పు.. నగరవాసుల్లో ఆందోళన..! విజయవాడను వాన ముప్పు వీడటం లేదు.. దీంతో రాత్రి నుంచి ఓ మోస్తారు వర్షం ప్రారంభం కావటంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నిన్నటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలోని నిరాశ్రయులకు ఆహారం, మంచినీళ్లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. బుడమేరు ఉదృతి…
Swine Flu Cases: తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నగరవాసులనే కాదు గ్రామాలు సైతం విష జ్వరాలతో అల్లాడుతున్నాయి.