వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Telangana DSC 2024: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ వచ్చేసింది. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసిన అనంతరం.. అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా తుది కీని విడుదల చేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.3, 300 కోట్లు విడుదల చేసింది.
TPCC Chief : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్‌కు పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ పని చేస్తున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేసిన…
దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు.
పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ దాదాపు నిండుకుండల్లా మారిపోయాయి. శ్రీశైలం, నాగార్జున జలాశయాలు పూర్తిగా నిండిపోగా.. గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కరించేలా అంతా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, గురుకుల సంస్థల్లో, విద్యాబోధన మౌలిక వసతులు, భోజన వసతి, తదితర అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
KCR Chandi Yagam: వ్యవసాయ క్షేత్రం గజ్వేల్ ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభమయ్యాయి.