Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జారీ చేయబోతున్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన నిబంధనలు మార్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
KTR: హైదరాబాద్ నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నారు.
SC Classification: ఈ రోజు జలసౌదాలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రెండు కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జరగనున్నాయి. మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా ఉన్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జరగబోతున్నాయి.
Ganesh Immersion 2024: హైదరాబాద్లో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. నగరం నాలుగు మూలల నుంచి గణనాథులు ట్యాంక్ బండ్ పైకి తరలి వస్తున్నాయి. దీంతో ఈరోజు (సోమవారం) ఉదయం హుస్సేన్ సాగర్ చుట్టు పక్కల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని రహీం(32) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.