Telangana Rains: తూర్పు-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుపానుగా మారింది. ఇది ఒడిశాకి ఆగ్నేయంగా దాదాపు 560 కి.మీ.ల దూరంలో కొనసాగుతోంది. ఇది గురువారం ఉదయం వాయువ్య దిశగా పయనించి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 25వ తేదీ తెల్లవారుజామున ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పూరీ, సాగర్ దీవుల మధ్య తీరం దాటుతుందని అంచనా. ఈ ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాది జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 6.02 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 81.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా బుధవారం నాటికి 102.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్ నుండి ఈశాన్య రుతుపవనాల సీజన్ వరకు, 5 జిల్లాల్లో గరిష్ట వర్షపాతం, 16 జిల్లాల్లో అధిక వర్షపాతం, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.
Trains Cancelled: దానా ఎఫెక్ట్.. మరో 17 రైళ్లు రద్దు .. సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు..