MMTS: ఎంఎంటీఎస్ రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే తిరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా సర్వ్ చేసేందుకు సిద్ధమైంది.
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది జరిగిన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సంగారెడ్డి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
AP CM Chandrababu: ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిసింది. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరువురి పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. తన చిన్ననాటి మిత్రుడిని పరామర్శించేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.…
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 150 మంది విద్యార్థులు వున్నారు.. అందులో 90 మంది అమ్మాయిలు, 60 మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు.. కానీ, అమ్మాయిలు మూత్రవిసర్జనకు వెళ్లాంటే.. ఒక్కటే మరుగుదొడ్డి ఉంది.. అది కూడా అద్వాన్నంగా ఉన్న తప్పని పరిస్థితుల్లో వాడుకుంటున్నారు..
ఈ ఏడాది కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఈ ఏడాదిలో ఈ రోజు నాల్గోసారి ఎత్తారు నీటిపారుదలశాఖ అధికారులు.. ఇన్‌ఫ్లో తగ్గడంతో బుధవారం రోజే శ్రీశైలం గేట్లను మూసివేశారు అధికారులు.. అయితే, మరోసారి క్రమంగా వరద ఉధృతి పెరడంతో.. ఈ రోజు శ్రీశైలం డ్యామ్‌లోని ఒక గేటును ఎత్తారు.. ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు నీటిని విడిచిపెడుతున్నారు..
Arekapudi Gandhi: నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటికి వస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.