Yadadri Temple: భక్తులకు అలర్ట్.. యాదాద్రిలో ఇక నుంచి అలా చేయడం నిషేధం..
- యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు భక్తులకు షాకిచ్చారు..
- ఫోటోలు- వీడియోలు నిషేధిస్తున్నట్లు ప్రకటించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు భక్తులకు షాకిచ్చారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈవిషయాన్ని ఆలయ ఈఓ భాస్కర్‌రావు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలోని పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఆలయం అత్యంత ముఖ్యమైనది. దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో గుర్తుండిపోయేలా ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చర్యలపై దేవస్థాన సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి కొండపై భక్తులు ఫోటోలు, వీడియోలు తీయకూడదని దీనిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో ఫ్యామిలీ ఫొటోలు దిగితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వీటిని దృష్టిలో వుంచుకుని భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలని సూచించారు. అనుమతి లేకున్న ఫోటోలు, వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. దీనిని గత ప్రభుత్వ పాలనలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. యాదగిరిగుట్టపై అర ఎకరం భూమిని 4.03 ఎకరాలకు విస్తరించి ఆలయాన్ని నిర్మించారు.
Jagtial Crime: గంగారెడ్డి మర్డర్ కేసు.. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు..
Also Read
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!