* ఢిల్లీ: నేడు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం.. జమిలి ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం
* అమరావతి: నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు
* హైదరాబాద్: నేడు కాంటినెంటల్ ఆస్పత్రిలో మోహన్‌బాబు ప్రెస్‌మీట్
* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు..
* ప్రకాశం : గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లెలో రెవిన్యూ సదస్సులో పాల్గొననున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..
* రాష్ట్ర మంత్రులు నారాయణ… ఆనం రామనారాయణ రెడ్డిలు సచివాలయంలో జరిగే కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు
* తూర్పు గోదావరి జిల్లా: నేటి నుండి మొదటి సారిగా రాజమండ్రి విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఎయిర్ బస్ సర్వీస్.. ఉదయం 06:30 గంలకు ఢిల్లీ నుండి బయలుదేరి ఉదయం 8:45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్న విమానం..
* విజయవాడ పర్యటనలో ఉన్న జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్,సవితమ్మ.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న మంత్రులు
* తిరుమల: ఇవాళ చక్రతీర్థ ముక్కోటి.. చక్రతీర్థంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న టీటీడీ..
* నంద్యాల: నేడు నందికొట్కూరు మండలం మల్యాల, వడ్డేమాన్‌లలో హెల్త్ సెంటర్లను, సచివాలయాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే జయ సూర్య..
* ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. శివంపేటలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. నల్లవల్లిలో 9.7, కంగ్టి 9.8, కోహిర్ 9.9, అంగడి కిష్టాపూర్ లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* హైదరాబాద్: నేడు కాంటినెంటల్ హాస్పిటల్‌లో మంచు మోహన్‌బాబు మీడియా సమావేశం..
* అమరావతికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వనున్న ప్రభుత్ం.. నేడు విజయవాడలో లాటరీ తీయనున్న సీఆర్‌డీకే అధికారులు