Damodara Raja Narasimha : వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. వారి డిమాండ్లను ఒకొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విపక్షాల కుట్రల్లో ఇరుక్కోవద్దని, వారి ఉచ్చులో పడి భవిష్యత్తు పాడుచేయకూడదని హెచ్చరించారు. ధర్నా చౌక్‌ను మాయం చేసిన వారే ఇప్పుడు ఆశావర్కర్లకు మద్ధతు తెలపడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మంత్రికి సూచన, గత పదేళ్లలో ఈ సమస్యలు పరిష్కరించలేకపోవడం మీద ప్రశ్నించారు. ఆయన, అప్పుడే సమస్యలు పరిష్కరించబడితే, ఇప్పుడు రోడ్డు పైకి వెళ్లాల్సిన పరిస్థితి రాకపోవచ్చు అని చెప్పారు.
Mamata Banerjee: ఢిల్లీ పీఠంపై ఆశ లేదు.. బీజేపీని ఓడించడమే లక్ష్యం
ఇదిలా ఉంటే నిన్న.. ఆశా వర్కర్ లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని విమర్శించారు. గత పదేళ్ళు పాలనలో ఆశా వర్కర్ ల వేతనాల పెంపు పై ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసిన పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూన్నారు. ఇది వారి ద్వంద వైఖరి కీ నిదర్శనమన్నారు. 2015 లో 106 రోజులు వేతనాలు పెంచాలని ధర్నా చేసిన ఆశా వర్కర్ లను గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. 2018, 2020, 2021, 2023 సంవత్సరాల లో ఆశా వర్కర్ లు సమ్మెలు, ధర్నా లు చేశారని మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తు చేశారు. అప్పుడు ఆశా వర్కర్ ల సమస్యలను పరిష్కరించలేని వాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
Section 498A: భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య.. వరకట్న చట్టాలపై చర్యలకు లాయర్ల డిమాండ్..