Arogyashri: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు ఆరోగ్యశ్రీ సీఈవోకు లేహాస్పిటల్స్ అసోసియేషన్ ఖ రాసింది. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఈ సంవత్సర కాలంలో అత్యధికంగా రూ. 1130 కోట్లు హాస్పిటల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ పదేళ్ళలో విడుదల చేసిన నిధుల్లో ఇదే అత్యధికం అని పేర్కొన్నారు. అలాగే, గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024లో రూ. 1130 కోట్లు విడుదల చేశారు. ఇక, ఇప్పటికే ఇంకా కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసినట్టు ప్రకటించాయి.
Read Also: Ajith Kumar : అప్పటి వరకు సినిమాల్లో నటించను
2015లో రూ. 444 కోట్లు…
2016లో రూ. 609 కోట్లు…
2017లో రూ. 524 కోట్లు..
2018లో రూ. 596 కోట్లు..
2019లో రూ. 681 కోట్లు…
2020లో రూ. 557 కోట్లు..
2021లో రూ. 783 కోట్లు…
2022లో రూ. 631 కోట్లు..
2023లో రూ. 515 కోట్ల రూపాయలను తెలంగాణ గత ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే, గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024లో 1130 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ విషయాన్ని నిన్న ఆరోగ్య శ్రీ సీఈఓతో జరిగిన చర్చల అనంతరం కూడా సేవలపై నెట్వర్క్ హాస్పిటల్స్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కావాలనే కొంత మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆరోగ్య శ్రీ సేవలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ పదేళ్ళలో విడుదల చేసిన నిధుల్లో రూ. 1130 కోట్లలో ఇదే అత్యధికం.