Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద 350 గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం.. పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. సుధీర్ గౌడ్ మెదక్ జిల్లా వాసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నాడు.. ఒరిస్సాకి చెందిన బిశ్వేశర్ సింగ్ అనే కార్మికుడితో కలిసి ఈ ఆల్ఫాజోలం వ్యాపారం చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. సుధీర్ గౌడ్, ఆయన భార్య శ్రీవాణి ముత్తంగికి చెందిన ఓ పంతులుతో కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ పాడుబడ్డ కంపెనీని అద్దెకు తీసుకున్నారు.. లండన్ లో పీజీ చదువుతున్న ఓ విద్యార్థి అల్ఫాజోలం తయారీకి సహకరించాడు.. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశాం.. 9 మంది పరారీలో ఉన్నారని ఎస్పీ రూపేష్ వెల్లడించారు
Read Also: Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఏడాది.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
కాగ, 8 కోట్ల రూపాయలతో కంపెనీ తీసుకుని.. 2 కోట్లతో మరమ్మతులు చేయించారు అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. మెడికల్ కంపెనీకి పర్మిషన్ తీసుకుని లోపల మాత్రం ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు.. ఆ తయారు చేసిన అల్ఫాజోలాన్ని హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అమ్ముతున్నారు.. ఆల్ఫాజోలం తయారు చేస్తూ ప్లాట్లు, విల్లాలు, భూములు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆల్ఫాజోలం అమ్మి గత ఏడాదిలో రూ. 20 కోట్లు సంపాదించారు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు ఆల్ఫాజోలం సరఫరా చేసి మరో రూ. 60 కోట్ల వరకు సంపాదించుకున్నారని ఎస్పీ రూపేష్ చెప్పుకొచ్చారు